టాలీవుడ్ లో వివాదాస్పద నటి శ్రీ రెడ్డి మొదలు పెట్టిన రచ్చ టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ ఉందని. అంటే హీరోయిన్ గా సినిమాలలో ఛాన్స్ రావాలంటే దర్శక, నిర్మాతలు చెప్పినట్టు వినాలి లేదంటే ఆఫీసుల చుట్టూ తిప్పించుకొని చెప్పులరిగాక లేదు పొమ్మంటారు. అయితే ఈ విషయంలో శ్రీ రెడ్డి ని ఎంతో మంది అవకాశం ఇస్తానని చెప్పి మోసం చేశారని తన దగ్గర అలా వాడుకొని మొహం చాటేసిన వాళ్ళ లిస్ట్ ఉందని ఒక్కొక్కటి బయట పెడతానని సంచలన వ్యాఖ్యలు చేసింది. అలానే టాలీవుడ్ లో చాలామంది పేర్లు ప్రస్తావించి హడలిస్తుంది. 

 

అయితే ఇదే విషయం ఇండస్ట్రీలో కొంతకాలంగా నానా రచ్చ అవుతూ సంచలనం అవుతోంది. వాస్తవంగా దాదాపు ఒకేసారి ఇండస్ట్రీని ఒక్క కుదుపు కుదిపిన సంఘటనలు డ్రగ్స్ అండ్ ఈ కాస్టింగ్ కౌచ్. ఈ రెండు విషయాలలో ఇండస్ట్రీలోని ప్రముఖులు చాలా ఇబ్బందులకి గురయ్యారు. డ్రగ్స్ విషయంలో డైరెక్టర్ పూరి జగన్నాధ్, చార్మి, నవదీప్...సహా చాలామందిని పోలీసులు విచారించారు. వీళ్ళకి సంబంధం లేకపోయినా ఆ కొద్ది రోజులు ఇండస్ట్రీలో అందరిని షాక్ కి గురి చేసింది. అలాగే ఈ కాస్టింగ్ కౌచ్. 

 

అయితే ఇప్పటికి ఈ ఇష్యూ ఏదో ఒక నటుడితోనో ఏదో ఒక సంఘటనతోనో హాట్ టాపిక్ గా మారుతోంది. అయితే కాస్టింగ్ కౌచ్ లేదని కాని నిర్మాతలు ఖచ్చితంగా కమిట్మెంట్ మాత్రం అడుగుతారని కొందరు వెల్లడించారు. ఇక వాస్తవంగా కమిట్మెంట్ అంటే సినిమాకి అగ్రిమెంట్ చేసేముందు షూటింగ్ కి ఎన్ని రోజులు పాల్గొనాలి, రెమ్యూనరేషన్ ఎంత, పబ్లిసిటీకి సహకరించాలి ..లాంటి విషయాలని కలిపి కమిట్మెంట్ అంటారు. కాని నచ్చావులే హీరోయిన్ మాధవీలత కాస్టింగ్ కౌచ్ కే ఇంకోపేరు కంట్మెంట్ అని ఆ పదానికి ఉన్న అర్థాన్ని మార్చేసి ఇలా తగలెట్టారాని ప్రతీ సందర్భంలో తెలుపుతూనే ఉంది. 

 

కానీ చాలామంది స్టార్ హీరోయిన్స్ మాకు ఇప్పటి వరకు ఈ కాస్టింగ్ కౌచ్ లో ఇబ్బందులు పడలేదని అన్నారు. రకుల్ ప్రీత్ సింగ్, అమలా పాల్, లానణ్య త్రిపాఠి అనుపమ పరమేశ్వరన్, రాశీ ఖన్నా వంటీ స్టార్ హీరోయిన్స్ కూడా ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఉంది కాని కాస్టింగ్ కౌచ్ లేదని మాకెప్పుడు అలాంటి ఇబ్బందులు ఎదురవలేదని క్లారిటి ఇచ్చారు. మరి కమిట్మెంట్ అంటే వీళ్ళు చెప్పిందా ..లేదా మాధవీ లత చెప్పిందా అని చాలామందికి సందేహాలున్నాయి.    

మరింత సమాచారం తెలుసుకోండి: