ఎన్నో సినిమాల్లో బాల నటుడుగా నటించి మెప్పించిన తరుణ హీరోగా నువ్వే కావాలి చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన విషయం అందరికి తెలిసిందే. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో తరుణ్ కి అప్పట్లో ఓ రేంజ్ లో ఆఫర్లు వచ్చాయి. ఇంకా అన్ని సినిమాల్లో ఈయన్ని హీరోయిన్ ఇష్టపడటం.. మళ్ళి ఎప్పుడో అతనికి ఆ విషయం తెలియటం.. తెలిశాక.. వాళ్ళ కోసం వెళ్ళటం.. మొత్తం అన్ని సినిమాల్లో ఇదే స్టోరీ. 

 

అయినా సరే ఇతగాడి సినిమాలు అందరికి నచ్చేవి.. ఎంతలా అంటే? ఈ తరుణ్ లవర్ బాయ్ అనేంత. అప్పట్లో తరుణ్ సినిమాలు అంటే చాలు ఎక్కడ లేని మూడు, ఉత్సాహంతో సినిమాలు చూడటానికి వెళ్లిపోయే వారు.. అభిమానులు. అలాంటిది.. ఆ తరుణ్ స్టార్ డామ్ అంత కూడా.. కేవలం 2 నుండి 3 సంవత్సరాలు మాత్రమే బాగా నడిచింది.. 

 

ఆ తరువాత తీసిన ప్రతి సినిమా ప్లాప్ అవ్వడంతో అతనితో సినిమా అంటేనే బయపడి పోయారు దర్శక నిర్మాతలు. దీంతో ఆ తర్వాత నిదానంగా సినిమాకు దూరం అవుతూ వచ్చిన తరుణ్ చివరికి బిజినెస్ మ్యాన్ అయ్యాడు. అయితే అలా సినీ కెరియర్ నాశనం అయ్యింది.. ఇకపోతే ప్రస్తుతం ఏలాంటి సినిమాల్లో నటించని తరుణ్ కి పెళ్లి ఎప్పుడు ?

 

అందరూ హీరోలు పెళ్లిళ్లు చేసేసుకుంటున్నారు.. ఇక్క తరుణ్ పెళ్లి మాత్రం అవ్వటం లేదు.. తరుణ్ పెళ్లి ఎప్పుడు అని రెండు సంవత్సరాల క్రితం తరుణ్ తల్లి రోజా రమణిని అడగగా.. త్వరలోనే అని అప్పుడు చెప్పింది.. కానీ ఇప్పటి వరుకు తరుణ్ పెళ్లి అయ్యింది లేదు.. అదిగో పెళ్లి.. ఇదిగో పెళ్లి అని అంటారే తప్ప.. పెళ్లి మాత్రం అవ్వడం లేదు. 

 

అయితే తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ లో ఓ తప్పుడు ప్రచారం చేసింది. అది ఎం అని అంటే.. తరుణ్ పెళ్లి ఫిక్స్ అయ్యింది అని.. ఆ వధువు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు అని రాసుకొని వచ్చింది.. తరుణ్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి చాలా రిచ్ అని కూడా రాసుకొచ్చింది ఆ యూట్యూబ్ ఛానల్.. మరి ఇలాంటి తప్పుడు ప్రచారానికి చెక్ పెట్టాలంటే ఈ హీరో త్వరగా పెళ్లి చేసుకోవాల్సిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: