ఈ రోజుల్లో సినిమా హిట్ అవ్వాలి అంటే ఎక్కువ సమయం తీసుకోవాలి. చిన్నహీరోలు ఏమో గాని పెద్ద హీరోలు మాత్రం ఇప్పుడు ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. ఒక్కో హీరో తమ సినిమాను విడుదల చేయడానికి ఏడాదికి పైగా సమయం తీసుకుంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్, చిరంజీవి, రామ్ చరణ్, ప్రభాస్ ఇలా చాలా మంది స్టార్ హీరోలు అదే పని చేస్తున్నారు. పెద్ద పెద్ద హిట్స్ రావాలి అంటే ఇప్పుడు ఎక్కువ టైం వెయిట్ చెయ్యాల్సి ఉంటుంది.

 

ఇటీవల అల్లు అర్జున్ అదే ఫాలో అయి మంచి హిట్ కొట్టేసాడు. అది కూడా సూపర్ హిట్. ఇప్పటి వరకు తన కెరీర్ లోనే కొట్టని హిట్ కొట్టాడు అల్లు అర్జున్. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో వచ్చిన అల వైకుంఠపురములో సినిమా అలాగే హిట్ కొట్టింది. వసూళ్ళ పరంగా కూడా ఈ సినిమా తిరుగు లేని విజయాన్ని సాధించింది అనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు నితిన్ కూడా అదే ఫాలో అయ్యాడు. అల్లు అర్జున్ ఎలా అయితే నా పేరు సూర్య ఫ్లాప్ తర్వాత వెయిట్ చేసాడో, నితిన్ కూడా అలాగే శ్రీనివాస కళ్యాణం సినిమా తర్వాత వేచి చూసాడు.

 

ఏడాది కి పైగా సమయం తీసుకున్నాడు నితిన్. ఇప్పుడు భీష్మ సినిమా తో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు ఈ యంగ్ హీరో. దీనితో ఈ సినిమా పై అతని అభిమానులు కూడా ఈ సినిమా పై భారీ అంచనాలే పెట్టుకున్నారు. రష్మిక మంధన హీరోయిన్ గా నటించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకి వస్తుంది. దీనితో అసలు సినిమా ఎలా ఉంటుంది...? నితిన్ హిట్ కొడతాడా లేదా అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. మరి అంచనాలను నితిన్ ఏ విధంగా అందుకుంటాడు అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: