పవన్ కళ్యాణ్ రీమేక్ మూవీ ‘పింక్’ పై వస్తున్న రూమర్లు విని ఇప్పటికే పవన్ అభిమానులు బెంబేలెత్తిపోతున్నారు. ఇలాంటి పరిస్థితులలో ఈ మూవీ పై వస్తున్న మరొక షాకింగ్ న్యూస్ పవన్ అభిమానులను మరింత గందరగోళంలో పడేస్తోంది.

 

ఈ మూవీని పవన్ కమర్షియల్ ఇమేజ్ కి అనుగుణంగా చాల మార్పులు చేర్పులు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు ఈ మూవీలో పవన్ పై మూడు ఫైట్లు రెండు పాటలు పెడుతున్నట్లు లీకులు వస్తున్నాయి. దీనికితోడు ఈ మూవీలో వచ్చే కోర్టు సీన్స్ లో పవన్ బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్లుగా సంభాషణలను ఒరిజినల్ మూవీ ‘పింక్’ తో సంబంధం లేకుండా క్రియేట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.


 
అంతేకాదు ‘పింక్’ సినిమాని అచ్చమైన మాస్ సినిమాలా తీస్తే ఎలా ఉంటుందో అలా ఈ మూవీలో దిల్ మార్పులు చేయించాడని వార్తలు వినిపిస్తున్నాయి. దీనితో ఒక ఉదాత్తమైన సామాజిక స్పృహతో కూడిన సినిమాకు ఇలాంటి మార్పులు చేస్తే ప్రేక్షకులు హరిషిస్తారా అన్న అభిప్రాయం ఇప్పుడు పవన్ అభిమానుల మధ్య డిస్కషన్ సెంటర్ పాయింట్ గా మారిందని తెలుస్తోంది.

 

వాస్తవానికి దిల్ రాజ్ ఈ సినిమాకు పెరిగిపోయిన భారీ బడ్జెట్ రీత్యా ఈ మూవీకి కమర్షియల్ రంగులు పులవడానికి చేస్తున్నట్లు కామెంట్స్ వస్తున్నాయి. అయితే దిల్ రాజ్ ఇన్ని ప్రయత్నాలు  చేస్తున్నా ఈ మూవీకి బయ్యర్ల నుండి స్పందన బాగా తక్కువగా వస్తోంది. దీనితో ‘అల వైకుంఠపురములో’ మూవీకి మ్యానియా క్రియేట్ చేసిన ‘సామజ వరగమనా’ పాట తీరులా తమన్ సిరివెన్నెల సిద్దూ శ్రీరామ్ ల కాంబినేషన్ ను మరొకసారి దిల్ రాజ్ రిపీట్ చేస్తూ ఒక మంచి మెలోడిని క్రియేట్ చేయించి ‘పింక్’ విడుదలకు చాల ముందుగా విడుఅల చేసి ఈ మూవీకి బయ్యర్లలో ఒక మ్యానియాను క్రియేట్ చేయాలని దిల్ రాజ్ న్యూహం అన్న మాటలు వినిపిస్తున్నాయి..

 

మరింత సమాచారం తెలుసుకోండి: