యంగ్ హీరో నితిన్ ప్రధాన పాత్రలో వెంకీ కుడుముల దర్శకత్వంలో వచ్చిన చిత్రం భీష్మ. సంక్రాంతి తర్వాత సరైన సినిమా లేక ఎదురు చూస్తున్న ప్రేక్షకుల కు ఈ సినిమాపై చాలా ఆశలే ఉన్నాయి. సంక్రాంతి తర్వాత చిన్న పెద్ద సినిమాలు చాలానే వచ్చాయి. అయినా సరే ఏ ఒక్క సినిమా కూడా ఆకట్టుకోలేదు అనే చెప్పాలి. ఈ సినిమా తో నితిన్ కూడా ట్రాక్ లోకి రావాలి అని భావిస్తున్నాడు. ఎప్పుడో దాదాపు రెండేళ్ళ క్రితం వచ్చిన శ్రీనివాస కళ్యాణ౦ సినిమా తో ఫ్లాప్ ఎదుర్కొన్న నితిన్ ఈ సినిమాపై భారీ ఆశలే పెట్టుకున్నాడు. 

 

ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా ట్విట్టర్ రివ్యూ బయటకు వచ్చింది. సినిమా చూసిన వాళ్ళు సోషల్ మీడియా లో తమ అభిప్రాయాలు చెప్తున్నారు. ప్రధానంగా సినిమా చూసిన చాలా మంది నితిన్ తన పాత్ర కు న్యాయం చేయడమే కాకుండా అఆ తర్వాత అతనికి ఆ రేంజ్ లో మంచి పాత్ర దొరికింది అంటున్నారు. ముఖ్యంగా దర్శకుడు కథానాయకుడి పాత్ర ఎలా ఉండాలో అలాగే చూపించాడు అంటున్నారు అభిమానులు. సోషల్ మీడియాలో నితిన్ గురించే ఎక్కువగా కామెంట్స్ వస్తున్నాయి. 

 

ముందు కామెడి సినిమా కు హైలెట్ గా నిలిచింది అంటున్నారు. సినిమా చూసిన వాళ్లకు కచ్చితంగా వినోదం దొరుకుతుంది అంటున్నారు అభిమానులు. ఈ సినిమా ద్వారా నితిన్ అనుకున్నది సాధించాడు అంటున్నారు. ఇక రష్మిక నటన కూడా సినిమాకు ప్రధాన అసెట్ అంటున్నారు. సినిమా కథ కూడా ఎక్కడా బోర్ కొట్టకుండా ఉందని, ప్రధాన సన్నివేశాలను చాలా జాగ్రత్తగా చూపించాడు దర్శకుడు అంటున్నారు. కామెడి కోసం అయినా సినిమా చూడవచ్చు అంటున్నారు. సంక్రాంతి తర్వాత మంచి సినిమా కోసం ఎదురు చూస్తున్న వాళ్లకు ఈ సినిమా మంచి వినోద భరిత చిత్రం అంటున్నారు సోషల్ మీడియాలో ప్రేక్షకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: