టాలీవుడ్ లోకి కెరటం సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన రకూల్ ప్రీత్ సింగ్ మొదటి సినిమా ఏదో మమా అనిపించింది.  ఆ తర్వాత సందీప్ కిషన్ హీరోగా నటించిన ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ సినిమాతో మంచి విజయం అందుకుంది. ఆ మూవీ రకూల్ కి తెలుగు తెరపై మంచి అదృష్టాన్ని పండించింది.  వరుసగా ఈ అమ్మడికి తెలుగు లో ఛాన్సులు రావడం మొదలయ్యాయి.  అప్పట్లో యంగ్ హీరోలు రకూల్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారంటే ఆ రేంజ్ లో ఈ అమ్మడు తన గ్లామర్ తో ఆకట్టుకుంది.  గత ఏడాది నాగార్జున హీరోగా రాహూల్ రవింద్ర దర్శకత్వంలో వచ్చిన ‘మన్మథుడు2’ లో ఓ రేంజ్ లో రెచ్చిపోయింది.

 

ఈ విషయంపై రకూల్ కొన్ని విమర్శలు కూడా ఎదుర్కొంది.  ప్రస్తుతం తెలుగు లో ఎక్కువ అవకాశాలు లేకపోవడంతో కోలీవుడ్ వైపు ఎక్కువగా చూస్తుంది. అంతే కాదు ఇటీవల బాలీవుడ్ లోకి జంప్ చేసి అక్కడ మంచి విజయాలే పొందింది.  ఈ అమ్మడు పూర్తిగా బాలీవుడ్ కే పరిమితం కాకుండా తెలుగు, తమిళ పరిశ్రమలో ఛాన్సుల కోసం ఎదురు చూస్తుంది. ఇక గుజరాతీ అమ్మడైన రకూల్ హైదరాబాద్ లోనే స్థిరపడేందుకు ఎక్కువ ఇష్టపడుతుంది. ఇక్కడ తనకు వ్యాపారాలు కూడా ఉన్నాయి. 

 

ఇక్కడ తనకు పెద్ద జిమ్ కూడా ఉంది.. ఎక్కువగా అక్కడ తన తన వ్యాయామానికి సంబంధించిన వర్క్ ఔట్స్ చేస్తుంది.  ఒక వారంలో ఎవరైనా ఫిట్ నెస్ సాధించగలమంటే అది నమ్మశక్యం కాని విషయం అని టాలీవుడ్ అందాలభామ రకుల్ ప్రీత్ సింగ్ పేర్కొంది. ఫిట్ నెస్ సాధించేందుకు దగ్గరదారులంటూ ఏవీ ఉండవని స్పష్టం చేసింది.  ఫిట్ నెస్ పై ఎంతో శ్రద్ద చూపించే రకూల్ తనలా వర్క్ ఔట్ చేస్తే ఎవరికైనా మంచి ఆరోగ్యం ఫిట్ నెస్ ఉంటుందని.. తనను ఫాలో చేస్తే అందకన్న హ్యాపీ మరొకటి లేదని అంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: