భీష్మ సినిమా ప్రీమియ‌ర్ షోలు కంప్లీట్ అవ్వ‌డంతో ఓవ‌ర్సీస్ నుంచి సినిమా చూసిన వాళ్లు సోష‌ల్ మీడియా మాధ్య‌మాల్లో సినిమా సూప‌ర్ సూప‌ర్ అంటూ మెసేజ్‌ల మోత మోగించేస్తున్నారు. భీష్మ హిట్ కాదు సూప‌ర్ హిట్ అంతే అంటున్నారు.. అస‌లు యావ‌రేజ్ అనే మాట లేనే లేదు.. హిట్ అన్న‌ది కూడా చాలా త‌క్కువ మంది అంటున్నారు.. ఓవ‌రాల్‌గా బొమ్మ బ్లాక్ బ‌స్ట‌ర్ అనే వాళ్లు ఎక్కువ మంది ఉన్నారు. సినిమా సూపర్ హిట్ అని, నితిన్ ఖాతాలో ఎట్టకేలకు విజయం చేరిపోయిందంటూ సోష‌ల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

 

కామెడీ కేక పుట్టించిందని, ఫస్టాఫ్‌లో కామెడీతో ప్రేక్షకులకు కావాల్సినంత ఆనందాన్ని ఇచ్చారని చెబుతున్నారు. ఇంటర్వెల్ ట్విస్ట్, నితిన్ నటన, క్యారెక్టర్ అదిరిపోయిందని పేర్కొంటున్నారు. ఇక నితిన్ - ర‌ష్మిక మ‌ధ్య కెమిస్ట్రీ గురించే ఎక్కువ మంది వైర‌ల్ చేస్తున్నారు. వాస్త‌వానికి భీష్మ సినిమాకు ముందు నుంచే పాజిటివ్ బ‌జ్ ఉంది. ఈ సినిమా రిలీజ్‌కు నెల రోజుల ముందు నుంచే సినిమా నుంచి ఏ చిన్న చిన్న అప్డేట్స్ వచ్చినా అవి మంచి వైరల్ అయ్యేవి.

 

అలా పాటలతో మంచి క్రేజ్ ను తెచ్చుకున్న ఈ సినిమాతో నితిన్ ఖ‌చ్చితంగా హిట్ కొడ‌తాడ‌ని అంద‌రూ నమ్మారు. ఇక ఇప్పుడు సినిమా రిలీజ్ అయ్యి ప్ర‌తి ఒక్క‌రు బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్ స్ప్రెడ్ చేస్తుండడంతో సినిమాపై ముందు నుంచి అంద‌రికి ఉన్న న‌మ్మ‌కాలు నూటికి నూరు శాతం నిజం అయ్యాయ‌నే చెప్పాలి. ఇప్ప‌టి వ‌ర‌కు నితిన్ ను ఏ సినిమాలో చూడ‌ని విధంగా ద‌ర్శ‌కుడు వెంకీ కుడుముల ఓ స‌రికొత్త యాంగిల్లో ప్ర‌జెంట్ చేశాడ‌నే సోష‌ల్ మీడియాలో రివ్యూలు వ‌స్తున్నాయి. ఇక ఏపీ, తెలంగాణ‌లో కూడా ఫ‌స్ట్ షోలు కంప్లీట్ అయ్యే స‌రికి ఈ సినిమాకు మ‌రింత సూప‌ర్ టాక్ రావ‌డం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: