టాలీవుడ్ లో త్రివిక్రమ్ క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. వరుసగా సినిమాలు చేయకపోయినా, చేసిన సినిమాలు ఎలా ఉన్నా, హిట్ అయినా ఫ్లాప్ అయినా సరే ఆయనతో సినిమా చేయడానికి చాలా మంది హీరోలు పోటీ పడుతూ ఉంటారు. ఎందుకంటే సినిమా హిట్ అయితే అది బంపర్ హిట్ అవ్వడమే. ముఖ్యంగా స్టార్ హీరో లు అయితే ఆయన డేట్స్ కోసం కూడా ప్రయత్నాలు చేస్తారు. సినిమా స్టైల్ పూర్తి భిన్నంగా ఉంటుంది కాబట్టి ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు అలాగే ఒక స్టార్ హీరో ఆయన సినిమా కోసం చాలా ప్రయత్నాలు చేసాడు. 

 

అతనే మహేష్ బాబు, వంశీ పైడపల్లి తో తర్వాత సినిమా చేస్తాను ముందు త్రివిక్రమ్ తో చెయ్యాలి అని చూసాడు. కాని అది విజయవంతం కాలేదు. ఇక త్రివిక్రమ్ తో సినిమా చేయడానికి రామ్ చరణ్ కూడా ట్రై చేసాడు. కాని త్రివిక్రమ్ ఎన్టీఆర్ కి కమిట్ అయ్యాడు. అలాగే చిరంజీవి కూడా త్రివిక్రమ్ తో సినిమా చెయ్యాలి అనుకున్నారు. పవన్ కళ్యాణ్ కూడా తన రీ ఎంట్రీ సినిమా మాటల మాంత్రికుడు తో ఉండాలని చూసాడు. కాని త్రివిక్రమ్ మాత్రం ఎన్టీఆర్ కి కమిట్ అయ్యాడు. ఇలా ఇప్పుడు టాలీవుడ్ లో త్రివిక్రమ్ క్రేజ్ ఒక రేంజ్ లో ఉంది. 

 

చాలా మంది హీరోలకు త్రివిక్రమ్ ఒక బ్రాండ్. ఆయన తో సినిమా చేస్తే, చాలు అనుకుంటారు. ఇప్పుడు త్రివిక్రమ్ మరో నాలుగేళ్ల పాటు బిజీ బిజీ అయిపోయారు. ఒకరకంగా ఆయనే తేల్చుకోలేని పరిస్థితి ఉంది. ఎవరితో సినిమా చెయ్యాలో కూడా అర్ధం కాకుండా ఉన్నాడు. పవన్ తో సినిమా చేస్తాడు అనుకుంటే ఎన్టీఆర్ తోనే అన్నాడు. దీనితో స్టార్ దర్శకులు కూడా త్రివిక్రమ్ క్రేజ్ చూసి షాక్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: