సినిమా మేకింగ్ విషయంలో వస్తున్న వినూత్న పోకడలు ఒక్కోసారి ఇబ్బందులకు కారణం అవుతున్నాయి. ముఖ్యంగా డిఫరెంట్ కాన్సెప్ట్ లతో తెరకెక్కుతున్న సినిమాలు వివాదాస్పదమవుతున్నాయి. కొన్ని చోట్ల అలాంటి సినిమాలకు మంచి ఆదరణ లభిస్తుంటే, మరి కొన్ని చోట్ల ఆ సినిమాలు నిషేదాలను కూడా ఎదుర్కొంటున్నాయి. తాజాగా ఓ యంగ్ హీరోకు అలాంటి పరిస్థితే ఎదురైంది. బాలీవుడ్‌లో గే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఓ సినిమాను యూఏఈ ప్రభుత్వం నిషేధించింది.

 

బాలీవుడ్‌ టాలీవుడ్‌ యంగ్ హీరో ఆయుష్మాన్‌ ఖురానా హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం శుభ్‌ మంగళ్‌ జ్యాదా సావదాన్‌. ఈ సినిమా దుబాయ్‌తో పాటు మిడిల్‌ ఈస్ట్ ప్రాంతంలో విడుదల కాలేదు. అయితే ఇందుకు చిత్రయూనిట్‌తో అక్కడ వారికి ఉన్న వ్యక్తిగత విభేదాలు ఏవీ కారణం కాదు. కేవలం ఆ దేశాల్లో గే కాన్సెప్ట్ చిత్రాల ప్రదర్శనను అనుమతించకూడదనే చట్టం ఉన్న కారణంగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాను ఆయుష్మాన్‌ ఖురానా, జితేంద్ర కుమార్‌ ల మధ్య ప్రేమ నేపథ్యంలో తెరకెక్కించారు. ఇప్పుడు ఆ కాన్సెప్ట్‌ కారణంగానే సినిమా నిషేదానికి గురైంది.

 

దుబాయ్‌ వర్గాల సమాచారం ప్రకారం `మేము కూడా శుభ్‌ మంగళ్‌ జ్యాదా సావదాన్ సినిమాను చూడాలని చాలా కాలంగా ఎదురుచూస్తున్నాం. ఇది గే రిలేషన్‌ షిప్‌ను నార్మల్‌గా చూపించిన తొలి బాలీవుడ్ చిత్రం. అందుకే మా ప్రాంతంలో కూడా ఈ సినిమా మీద చాలా ఆసక్తి నెలకొంది. అయితే అనూహ్యంగా ఇక్కడి చట్టాల ప్రకారం ఆ సినిమా నిషేదించబడింది. అందుకు చింతిస్తున్నాం` అన్నారు. ఆనంద్‌ ఎల్‌ రాయ్, భూషణ్‌ కుమార్‌, హిమాన్షు శర్మ, కృష్ణన్‌ కుమార్‌లు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు హితేష్‌ కేవల్య దర్శకుడు. ఈ సినిమాలో గజరాజ్‌ గుప్తా, నీనా గుప్తా, మనురిషి చద్దాలు కీలక పాత్రల్లో నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: