తెలుగు ఇండస్ట్రీ తేజ దర్శకత్వంలో ‘జయం’ చిత్రంతో హీరోగా వెండి తెరకు పరిచయం అయ్యాడు.  ఆ తర్వాత దిల్ చిత్రంతో మరో విజయం అందుకున్నాడు.  నితిన్ ఇండస్ట్రీకి వచ్చి పందొమ్మిదేళ్లు అయ్యింది.  అయితే కెరీర్ పరంగా చెప్పుకోదగ్గ హిట్ మాత్రం లేదు.   కానీ హీరోగా ఎక్కడ కూడా ఏమాత్రం డ్యామేజ్ లేకుండా సాఫీగా కొనసాగిస్తున్నాడు.  తాజాగా వెంకి కుడుముల దర్శకత్వంలో నితిన్ - రిష్మక మందన జంటగా ‘భీష్మ’ చిత్రం రిలీజ్ అయ్యింది.  ఈ చిత్రం ప్రీమియం షో టాక్ బాగానే ఉంది.  అంతే కాదు నితిన్ కెరీర్ లో మంచి కామెడీ ఎంట్రటైన్ మెంట్ చిత్రం అంటున్నారు. 

 

మొదటి నుంచి హీరో, దర్శకులు కూడా ఇదే చెబుతున్న విషయం తెలిసిందే. ఇక థియేటర్లో కూర్చున్న ప్రేక్షకులు విజిల్స్ వేసే సన్నివేశాలు చాలా ఉన్నాయని అంటున్నారు.  నాన్ స్టాప్ కామెడీ ఉన్న ఫస్ట్ హాఫ్, స్పెషల్లీ మీమ్స్ డైలాగ్స్ సూపర్బ్ అలరించాయట.  మొదట హీరో, హీరోయిన్ మద్య వైరాలు.. హీరోయిన్ ని లైన్లో పెట్టడానికి హీరో పడే కష్టాలు అన్నీ ఇన్నీ కావు.  ఇక  సెకండాఫ్ మొదటి 40 నిమిషాల కామెడీ తో బాగా అలరించారట.  ఎక్కడ ఏమాత్రం బోర్ ఫిలింగ్ అయ్యే ఛాన్సే లేదని అంటున్నారు. ఇక భీష్మ మూవీలో టైటిల్ రోల్ లో నటిస్తున్న నితిన్ చాలా స్మార్ట్ గా కనిపిస్తున్నాడట.. డ్రెస్సింగ్ స్టైల్ కూడా అదిరిపోయిందని టాక్. 

 

ఛలో చిత్రం నుంచి మొన్నటి సరిలేరు నీకెవ్వరు వరకు కన్నడ బ్యూటీ రష్మిక మందన నటనతో అలరిస్తుంది.  ఈ అమ్మడు ఏ హీరోతో అయినా కెమిస్ట్రీ బాగా వర్క్ ఔట్ అవుతుంది. అంతే కాదు తన పర్ఫామెన్స్ తో అందరి మనసు దోచేస్తుంది.  ఇక వెంకి కుడుముల టేకోవర్ చాలా బాగా వర్క్ ఔట్ అయ్యిందని అంటున్నారు.  ఈ సినిమాలో ప్రతి సన్నివేశంలో ఆయన మార్క్ కనిపిస్తుంది. ఇక స్క్రీన్ ప్లే విషయానికి వస్తే ఎక్కడ ఏమాత్రం డ్యామేజ్ కాకుండా చాలా చక్కగా తీసుకు వెళ్లారని ప్రేక్షకులు అంటున్నారు.  కామెడీ పరంగా నితిన్ తో పాటు వెన్నెల కిషోర్, రఘుబాబు, సంపత్ రాజ్ లు కడుపుబ్బా నవ్వించారట.  ఏది ఏమైన ప్రీమియం షో టాక్ అయితే బాగానే వినిపిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: