ఇటీవల కాలంలో సినిమా మేకింగ్ లో చాలా మార్పులు వస్తున్నాయి. గతం లో సినిమా లో బూతులు వాడటానికి చాలా ఆలోచించే వారు కానీ ఇపుడు ట్రెండ్ మారింది. యంగ్ జనరేషన్ హీరోలు తమ సినిమా ల్లో బూతులు కాస్త ఎక్కువగానే వాడుతున్నారు. ఇటీవల ఫలక్ నుమ దాస్ సినిమా తో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న విష్వక్ సేన్ సినిమాల్లో బూతులు వాడకం పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

 

ఫలక్ నుమ దాస్ సినిమా లో బోల్డ్ పదాలు వాడిన విశ్వక్ తాజాగా హిట్ సినిమాలో కూడా అదే ఫార్ములా ఫాలో అయ్యాడు. సినిమా లో బూతులు వాడటం అంతే  అప్డేట్ అవ్వడమేనని అంటున్నాడు విశ్వక్ సేన్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 'అప్ డేట్ అవ్వడం అంటే ఇదే. మేం బోల్డ్ ఫిలిం మేకర్స్ గా మారాం. ఇక నా విషయానికొస్తే నేను హద్దులు పెట్టుకోను. . ఓ బూతు పెడితే ఆడియన్స్ రారేమో అని అనుకోను. ప్రతి సినిమాలో అన్ని హ్యూమన్ ఎమోషన్స్ ఉండాలి. నా సినిమాలో కూడా అలాంటి ఎమోషన్స్ ఉండాలనుకుంటాను. అందులో భాగంగా బూతు వస్తుంది తప్ప, కావాలని నేను బూతు ఎందుకు పెడతాను' అంటూ చెప్పుకొచ్చాడు.

 

 

 కొన్ని కొన్ని సందర్భాల్లో సిట్యువేషన్ కూడా బూతు డిమాండ్ చేస్తుంది అందుకే మా సినిమాల్లో కొన్ని సార్లు బూతులు మాట్లాడుతుంటే అన్నాడు. ముఖ్యంగా హిట్ సినిమా స్క్రిప్ట్ నేను రాయాలేదు. నేను దర్శకత్వం చేయలేదు. కేవలం దర్శకుడు చెప్పినట్లు మాత్రమే పని చేశాను. అలాంటపుడు సినిమా లో బూతులు ఉంటే న తప్పు ఎలా అవుతుంది అని ప్రశ్నించాడు. ఫలక్ నుమా దాస్ సినిమా సూపర్ హిట్ అందుకున్న విశ్వక్ హిట్ తో మరో హిట్ కొడతాడా చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: