మెగాస్టార్ చిరంజీవి చిన్న అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం సూపర్ మచ్చి. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా కు సంబంధించి మెగా ఫ్యామిలీ చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. కళ్యాణ్ తొలి చిత్రం విజేత కు మంచి టాక్ వచ్చిన సక్సెస్ కాకపోవటం తో ఈ సినిమా విషయం లో మరింత కేర్ తీసుకుంటున్నారు.

 

 

ఈ సినిమాకు పులివాసు దర్శకుడు. కళ్యాణ్ మాస్ లుక్ లో కనిపిస్తున్న  ఈ సినిమా ఇప్పటికే కొంతవరకూ షూటింగు జరుపుకుంది. రీసెంట్ గా ఈ సినిమా అవుట్ పుట్ ను మెగాస్టార్ చిరంజీవి పరిశీలించారట. రషెస్ చూసిన చిరు ఔట్ పుట్ విషయంలో కొంత అసంతృప్తిని వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. చిరంజీవి పూర్తి కథను విని గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తరువాతనే ఈ ప్రాజెక్టు మొదలైంది.

 

 

అయితే స్క్రీన్ ప్లే విషయంలో పెద్దగా పట్టు కనిపించకపోవడంతో, ఆయన పరుచూరి బ్రదర్స్ ను రంగంలోకి దించి రిపేర్లు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అలాగే డైలాగ్స్ పై కూడా దృష్టి పెట్టమని పరుచూరి బ్రదర్స్ కి సూచించాడట. అల్లుడి కెరీర్ కు కీలకమైన సినిమా కావటం తో చిరు స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా కళ్యాణ్ లుక్ సూపర్ అంటున్నారు మెగా ఫ్యాన్స్.

 

ప్రతి విషయం లోనూ సలహాలు ఇస్తున్నాడు. ముఖ్యంగా నిర్మాణ పరమైన విలువల దగ్గర కాంప్రమైజ్ కావద్దని కూడా ఆయన నిర్మాత రిజ్వాన్ కి చెప్పాడని తెలుస్తోంది. సినిమా పూర్తయిన తరువాత ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు చేతిలో పెట్టాలనే ఉద్దేశంతో చిరంజీవి వున్నాడట. మరి ఈ సినిమా తో అయిన కళ్యాణ్ దేవ్ కమర్షియల్ సక్సెస్ అందుకుంటడేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: