కోలీవుడ్ లో విజయదళపతి విజయ్ కి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  సూపర్ స్టార్ రజినీకాంత్ కి ఎంత క్రేజ్ ఉందో ఆ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించాడు విజయ్.  ప్రస్తుతం విజయ్ నటిస్తున్న ప్రతి చిత్రం మొదట కాంట్రవర్సీలకు గురి అవుతూ.. తర్వాత భారీ కలెక్షన్లు వసూళ్లు చేస్తుంది.  కేవలం తమిళంలోనే కాదు తెలుగు లో కూడా విజయ్ కి ఎంతో క్రేజ్ ఉంది.  ఆ మద్య వచ్చిన అదిరింది, సర్కార్, విజిల్ మంచిహిట్ టాక్ తెచ్చుకోవడమే కాదు.. కలెన్లు కూడా బాగా రాబట్టాయి.  ఇటీవల విజయ్ ఆస్తులపై ఐటీ దాడులు జరిగిన విషయం తెసిందే. 

 

ఆయన ఇల్లు, ఆఫీసులు, స్నేహితుడి ఇండ్లపై కూడా ఐటీ శాఖ వారు దాడులు చేశారు.  అయితే విజిల్, అదిరింది సినిమాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని డైలాగ్స్ ఉన్నాయని.. సామాన్యుల రెచ్చగొట్టే విధంగా విజయ్ చిత్రాలు తీస్తున్నారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. అయితే ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తి చూపినందుకు తమ హీరోని కావాలనే ప్రభుత్వం టార్గెట్ చేసిందని అభిమానులు ఫైర్ అయ్యారు.  తాజాగాఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరో పేరు గట్టిగా వినిపిస్తోంది. అతడే ఇలయథలపతి విజయ్. సర్కార్ - బిగిల్ తో ఆ డోస్ ఇంకాస్త పెరిగింది. తమిళనాడులో విజయ్ సినిమా ఈజీగా 100 నుంచి 200 కోట్ల క్లబ్ లో చేరుతున్న విషయం తెలిసిందే.

 

ఈ నేపథ్యంలో విజయ్ నుంచి నెక్స్ట్ రాబోతున్న మాస్టర్ సినిమాతో 100కోట్ల పారితోషికం అందుకుంటున్నాడట. అంటే తమిళ్ నాట మొత్తం డిస్ట్రిబ్యూషన్ రైట్స్ విజయ్ తీసుకున్నాడట. ఇక మిగతా డిజిటల్ ఓవర్సీస్ రైట్స్ మొత్తం నిర్మాతలు చూసుకుంటారు.  అయితే విజయ్ రెమ్యూనరేషన్ బాలీవుడ్ ని తలదన్నేలా ఉందని టాక్ వినిపిస్తుంది.  బాలీవుడ్ హీరోలు కూడా మూవీ మార్కెట్ కి తగ్గట్టు ఇదే ఫార్ములాను ఉపయోస్తుంటారు.  మరి ఈ విషయంలో విజయ్ సక్సెస్ అవుతాడా లేదా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: