సమ్మర్ అంటే రెండు  నెలల పాటు సెలవులు. స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాసేసి ఎంజాయ్ మెంట్ కోసం వెయిట్ చేస్తారు. హాలిడేస్ క్యాష్ చేసుకునేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సమ్మర్ కు క్రేజీ ప్రాజెక్ట్స్ చాలా వస్తున్నా.. ఇందులో ఒకే ఒక స్టార్ ఉన్నాడు. 


10 రోజులు సెలవులున్న సంక్రాంతికి రెండు పెద్ద సినిమాలు అల వైకుంఠపురములో.. సరిలేరు నీకెవ్వరు వస్తే.. రెండు నెలల పాటు హాలిడేస్ ఉన్న సమ్మర్ కు ఇంకెంతమంది స్టార్స్ వస్తారో అని సినీలవర్స్ ఆశగా ఎదురుచూశారు. అయితే.. వీళ్ల ఆశలపై పెద్ద హీరోలు నీళ్లు చల్లారు. సమ్మర్ బరిలో పవన్ ఒక్కడే దిగుతున్నాడు. 

 

సినిమా సమ్మర్ అంటే ఏప్రిల్, మే. ఈ రెండు నెలల్లో రామ్ నటిస్తున్న రెడ్ సినిమా ఏప్రిల్ 9న. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా లవ్ స్టోరీ 16న రిలీజ్ అవుతున్నాయి. ఇక మేలో సాయిధరమ్ తేజ్ సోలో బతుకే సో బెటర్.. రవితేజ క్రాక్ మూవీ వస్తోంది. ఇలా చాలా క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నా.. వచ్చే స్టార్ హీరో మాత్రం పవన్ ఒక్కడే. 

 

సమ్మర్ హడావిడి అంతా పవన్ కళ్యాణ్ దే. మరో స్టార్ హీరో పోటీలో లేడు. రెండేళ్ల విరామం తర్వాత పవన్ పింక్ రీమేక్ తో రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమాను మే 15న రిలీజ్ చేస్తున్నట్టు.. నిర్మాత దిల్ రాజు ఆల్ రెడీ ఎనౌన్స్ చేశాడు. జూన్ 10 దాటితే గానీ.. స్కూల్స్ తిరిగి ప్రారంభం కావు. ఈ లెక్కన నాలుగు వారాల పాటు.. థియేటర్స్ లో సందడంతా మెగా ఫ్యాన్స్ దే. ఓవర్ ఆల్ గా ఈ సమ్మర్ ఒక్క స్టార్ హీరోతో ముగిసిపోతోందన్న మాట. సినిమా ప్రేమికులు మాత్రం సమ్మర్ లో ఫుల్ ఎంజాయ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఏ సినిమా వస్తుందా.. థియేటర్ లో సందడి చేద్దామా అని ఎదురుచూస్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: