బాలివుడ్ లో చాలా బిజీ అయిపోయి, వరుస విజయాలతో దూసుకుపోతూ హాలీవుడ్ లో కూడా ఆఫర్లు దక్కించుకున్న హీరోయిన్ ప్రియాంకా చోప్రా. ఈమెకు హాలీవుడ్ లో వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. బాజీరావు మస్తాని సినిమా తర్వాత ఈ ముదురు హీరోయిన్ హాలీవుడ్ లో అడుగుపెట్టి అక్కడ వరుసగా సినిమాలు చేసింది. అయితే ఆశించిన స్థాయిలో మాత్రం ప్రియాంక హిట్స్ కొట్టలేదు అనే అభిప్రాయమే ఎక్కువగా వినపడుతుంది. హాలీవుడ్ లో ఆమెకు క్రేజ్ ఉన్నా సరే హిట్స్ మాత్రం రావడం లేదని అంటున్నారు సినీ జనాలు. 

 

అక్కడి అవకాశాల కోసం ఆమె చాలానే కష్టపడింది కూడా. యువ సింగర్ ని పెళ్లి చేసుకోవడం తో ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఇక అక్కడ ఏ కార్యక్రమం జరిగినా సరే ప్రియాంక పోస్ట్ చేసే ఫోటోలు, వీడియో లు, ఆమె ట్రెండ్ సెట్ చేసే విధానం తో పాటుగా ఆమె కనపడే తీరు, స్కిన్ షో వంటివి హాలీవుడ్ లో ఎక్కువగానే హైలెట్ అవుతూ వచ్చాయి. కాని ఆమెకు మాత్రం ఇప్పుడు అవకాశాలు రావడం లేదు హాలీవుడ్ లో అంటున్నారు సినీ జనాలు. దీనికి కారణం కూడా చెప్తున్నారు. 

 

అక్కడ చాలా మంది హీరోయిన్లు అవకాశాల కోసం చూస్తున్నారు. ముఖ్యంగా కుర్ర హీరోయిన్లు అయితే ఒక్క అవకాశం వస్తే చాలు అనుకుంటున్నారు. దానికి తోడు ప్రియాంక పారితోషకం కూడా భారీగానే ఉంటుంది. ఆమెకు లక్షల డాలర్లు ఇవ్వాల్సి వస్తుంది. దానికి తోడు ఆమె ముదురు హీరోయిన్ అయిపోయింది. నటన ఉన్నా సరే క్రేజ్ తక్కువే అంటున్నారు. కాబట్టే ఆమెను అవకాశాలు వరించడం లేదు అనేది అక్కడి జనాల మాట. అందుకే ఈ మధ్య మళ్ళీ బాలివుడ్ మీద ప్రియాంక ఎక్కువగా దృష్టి పెట్టింది అంటున్నారు జనాలు. ఇప్పుడు ఇక్కడ సినిమా లు చేయడానికి ప్రయత్నాలు చేస్తుందని టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: