హీరోయిన్ అవ్వాలని అడుగు పెట్టే వాళ్ళు అవకాశాల కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఒక్క మంచి సినిమాలో అవకాశం వస్తే చాలు కెరీర్ గాడి లో పడటమే కాకుండా ఇక వెనుతిరిగి చూసుకునే అవసరం ఎంత మాత్రం ఉండదు అనేది వాస్తవం. చాలా మంది అమ్మాయిలు ఇదే ఫాలో అవుతారు. అంత వరకు బాగానే ఉంది గాని, అవకాశం వస్తే మాత్రం కచ్చితంగా దర్శక నిర్మాతలకు బలం అవ్వాలి హీరోయిన్లు. వాళ్ళు సరిగా ఉంటేనే సినిమా హిట్ అవుతుంది. అందుకే చాలా మంది హీరోయిన్ల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. 

 

ఇదిలా ఉంటే ఇప్పుడు తెలుగు హీరోయిన్లు నిర్మాతలకు దర్శకులకు ఆఫర్లు ఇస్తున్నారు. అవకాశం ఇవ్వండి చాలు మేము మీకు ఎం ఇవ్వాలో అది ఇస్తాం అంటున్నారు. అంటే వేరేలా అని కాదు, డబ్బింగ్ మేమే చెప్తాము, హోటల్ ఖర్చులు ఎక్కువ కాకుండా చూసుకుంటాం, సినిమా ప్రమోషన్ లో పాల్గొంటాం, సోషల్ మీడియా లో కావాల్సిన సహకారం అందిస్తాం, సినిమా విడుదల అయ్యే వరకు మీకు అందుబాటులో ఉంటాం. సినిమా హీరో బట్టే మాకు పారితోషకం ఇవ్వండి, ఎక్కువ కూడా ఇవ్వాలని మేము డిమాండ్ చేయం.

 

మా రేంజ్ ఏంటో మీకు తెలుసు. మమ్మల్ని తక్కువ చేసి చూడకుండా ఉంటే చాలు. సినిమా షూటింగ్ లో మేము గొంతెమ్మ కోరికలు కోరం, డిమాండ్లు చేయము. అంటూ చాలా మంది హీరోయిన్లు ఇప్పుడు నిర్మాతలకు ఆఫర్లు ఇస్తున్నారట. రష్మిక మంధన, పూజ హెగ్డే, నభా నటేష్, నిధి అగర్వాల్ ఇలా చాలా మంది హీరోయిన్లు ఇవే ఆఫర్లు ఇస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. డబ్బింగ్ తల నొప్పి అనేది మీకు ఉండకుండా మేము చూసుకుంటాం అని తెలుగు నేర్చుకుంటాం అని చెప్తున్నారట హీరోయిన్లు. హీరోయిన్ల తీరుతో ఇప్పుడు నిర్మాతలు కూడా సంతోషంగా ఉన్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: