ఈ మద్య సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి కొంత మంది అదృష్టం భలే కలిసి వస్తుంది.  ఒక్కనైట్ లోనే పిచ్చి పాపులారిటీ వచ్చేస్తుంది.  ఒక్కపాట‌.. ఒకే ఒక్క కన్ను గీటుతో దేశ వ్యాప్తంగా అభిమానుల్నీ సంపాదించుకుంది. ఇంతకీ ఆ వన్నెలాడి ఎవరో మీకు అర్థమయ్యే ఉంటుంది. మాలీవుడ్ బ్యూటీ ప్రియా ప్రకాశ్ వారియర్. ప్రియా వారియర్ నటించిన మలయాళ సినిమా ‘ఒరు ఆదార్ లవ్’ తెలుగులో ‘లవర్స్ డే’ పేరిట విడుదలైంది. అయితే, ప్రోమో వీడియోలతో విపరీతంగా పాపులర్ అయిన ప్రియా.. సినిమాతో మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. సినిమా ఘోరంగా విఫలమవడంతో ప్రియా వారియర్ గురించి ప్రేక్షకులు పట్టించుకోవడం మానేశారు. 

 

ఆ మద్య ప్రియా వారియర్ తెలుగు లో నటించబోతుందని ఎన్నో సార్లు వార్తలు వస్తూనే ఉన్నాయి.  అప్పట్లో హీరో నితిన్ నటించే సినిమాలో ఓ ఛాన్స్ కొట్టేసిందని తెగ వార్తలు వచ్చాయి.  ప్రియావారియర్ బాలీవుడ్ లోకి అడుగు పెట్టింది.. కానీ తెలుగు లో మాత్రం ఛాన్సు దక్కించుకోవడం లేదు. తెలుగులో ప్రియా వారియర్‌కు మంచి స్కోప్ దొరికినట్టే అనుకున్నారు. కానీ అలా జరగలేదు.. దాంతో ఈ అమ్మడికి తెలుగు లో ఛాన్సు లేదనే అంటున్నారు.  ఇటీవల కాలంలో వరుసగా తన హాట్ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.  కొంత కాలంగా  ప్రియవారిర్ స్టార్ స్టేటస్ ని ఎంజాయ్ చేస్తోంది. కొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్ట్స్ కు సైన్ చేసినట్లు సమాచారం. 

 

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తరచుగా ఫొటోస్, వీడియోస్ షేర్ చేస్తోంది. తాజాగా ప్రియవారియర్ రెడ్ డ్రెస్ వేసుకొని ముద్దు పెడుతూ ఓ వీడియో తన ఇన్ స్ట్రాగామ్ లో పోస్ట్ చేసింది.  ఏది ఏమైనా ఈ మద్య కాలాంలో సినిమాల్లో ఛాన్సుల కోసం రక రకాలుగా ఫోటో షూట్స్ తీయంచుకుంటున్నారు.  బాలీవుడ్ లో అయితే కాస్త హద్దులు దాటి మరీ టాప్ లెస్ ఫోటోస్ తో ఊదరగొడుతున్నారు.. హీరోయిన్ల ఛాన్సులు దక్కుతాయన్న ఆశతో ఇలా చేస్తున్నారని పలువురు నెటిజన్లు అంటున్నారు. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by priya Prakash Varrier💫 (@priya.p.varrier) on

మరింత సమాచారం తెలుసుకోండి: