ఈ మధ్యకాలంలో ఓ  హీరోయిన్ గురించి ఓ వార్త బయటికొచ్చింది. ఈ మధ్య కాలంలో ఒక యువ హీరో సినిమాలో హీరోయిన్ గా నటించింది ఈ అమ్మడు. సినిమా రిలీజ్ అయింది.. కానీ అనుకున్నంత సక్సెస్ సాధించలేకపోయింది. స్వయంగా సినిమా హీరో నే కథ రాసుకున్నప్పటికి కూడా సినిమా విజయం సాధించలేకపోయింది. ఇక ఈ సినిమా ఫ్లాప్ తో ఆ హీరోయిన్ కి నిరాశ తప్పలేదు. అంతేకాదు ఆ హీరోయిన్సినిమా నిర్మాత పై కూడా కాస్త గుర్రుగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే సినిమా రిలీజ్ కు ముందు ఈ సినిమా నిర్మాత ఒక లెజెండరీ దర్శకుడితో... ప్రమోషనల్ ఇంటర్వ్యూ చేసేందుకు ప్లాన్ చేశారట. 

 

 

 అయితే ఈ ఇంటర్వ్యూ లో హీరో హీరోయిన్స్ పాల్గొనాల్సి ఉంది. ఆ లెజెండరీ దర్శకుడితో ప్రమోషన్ ఇంటర్వ్యూలో కాసేపు చిట్  చాట్ చేయాల్సి ఉంది. అయితే ఆ  దర్శకుడితో ప్రమోషనల్ ఇంటర్వ్యూ ముందే ఈ సినిమా హీరోయిన్ కి స్కిన్ ఎలర్జీ వచ్చింది. దీంతో తాను ఆ లెజెండరీ దర్శకుడితో చేస్తే ప్రమోషనల్  ఇంటర్వ్యూలో పాల్గొనలేను అంటూ నిర్మాతకు చెప్పేసిందట ఆ హీరోయిన్. ఇక ఆ  హీరోయిన్ సమాధానంతో కాస్త ఆగ్రహం వ్యక్తం చేసిన నిర్మాత.. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఇంటర్వ్యూలో తప్పనిసరిగా పాల్గొనాలి అంటు తెగేసి చెప్పేసారట. 

 

 

 ఒకవేళ ఇంటర్వ్యూలో పాల్గొనకపోతే నీ హోటల్ బిల్లులు  మేము కట్టలేమని నువ్వే కట్టుకోవాలి.. అంటూ ఈ సినిమా నిర్మాత  ఒక స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చారట. అయితే నిర్మాత అలా వార్నింగ్  ఇవ్వగానే బెదిరిపోయి నిర్మాత చెప్పినట్లు వినేందుకు అక్కడ ఉన్న హీరోయిన్ అచ్చ తెలుగు మాట్లాడే లోకల్ బొమ్మ కాదు.. ఇంపోర్ట్ బ్యూటీ. దీంతో తనకు స్వీట్ వార్నింగ్ ఇచ్చిన నిర్మాత కే షాకిచ్చింది ఆ అమ్మడు. అందుకే హోటల్ వారికి చెప్పాపెట్టకుండా నైట్ నైట్ ఏ రూమ్ ఖాళీ చేసి జంప్ అయ్యింది. దీంతో హోటల్ మేనేజ్మెంట్ వారు ఇక ఈ హోటల్ బిల్లు కాస్త నిర్మాత నుంచి వసూలు చేసారు. నిర్మాత కట్టను అని చెప్పినప్పటికీ ఎంతో సతాయించి మరి ఈ బిల్లు వసూలు చేశారట. ఆ విషయంలో సినిమా నిర్మాత పై హీరోయిన్ గుర్రుగానే ఉందట. అయితే ఇలాంటి విషయాలను ఎంత దాచిన వారి నోట వీరి నోట పడి బయటకు వస్తూనే ఉంటాయి కదా. ఈ మేటర్ కూడా ఇలాగే బయటకు వచ్చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: