మాజీ ముఖ్య‌మంత్రి కిర‌ణ్ కుమార్ రెడ్డికి రెండు ప్ర‌ధాన జాతీయ పార్టీల నుండి బంపరాఫ‌ర్లు వ‌చ్చాయి. కాంగ్రెస్‌ ను వీడి తిరిగి రాహుల్ స‌మ‌క్షంలో కాంగ్రెస్‌ లో చేరి.. కామ్‌ గా ఉన్న కిర‌ణ్‌ కు పీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వి స్వీక‌రించాలంటూ పార్టీ నుండి ఆఫ‌ర్ వ‌చ్చింది. అయితే ఈయన ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలుస్తానని తీరా ఎన్నికల సమయంలో ఇంట్లోంచి బయటకి కూడా రాలేదు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఇటీవల కాంగ్రెస్ నుంచి పిలుపు వచ్చింది డిల్లీకి రమ్మని. అయితే.. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన వివరాలిలా ఉన్నాయి...

 

 

ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (ఏపీసీసీ) ఆఫీస్‌ బేరర్స్‌, డీసీసీ అధ్యక్షులను శుక్రవారం ఆలిండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) ప్రకటించింది. 11 మంది ఉపాధ్యక్షులు, 18 మంది ప్రధాన కార్యదర్శుల పేర్లను ఖరారు చేసింది. అలాగే 29 మందితో కో- ఆర్డినేషన్ కమిటీ, 12 మందితో రాజకీయ వ్యవహారాల కమిటీని ఏర్పాటు చేసింది.

 

 

మరో 18 మందిని డీసీసీ అధ్యక్షులుగా నియమిస్తూ ఏఐసీసీ నిర్ణయం తీసుకుంది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణు గోపాల్ ఈ మేరకు శుక్రవారం సాయంత్రం ఓ ప్రకటన విడుదల చేశారు. మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డికి రాజకీయ వ్యవహారాలు, సమన్వయ కమిటీల్లో స్థానం కల్పించారు.

 

 

రాజకీయ వ్యవహారాల కమిటీకి చైర్మన్‌ గా పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్‌ వ్యవహరిస్తారు. సమన్వయ కమిటీకి చైర్మన్‌ గా రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఊమెన్‌ చాందీ ఉంటారు. యూత్‌ కాంగ్రెస్‌, ఎన్ఎస్‌యూఐ, మహిళా కాంగ్రెస్‌, సేవాదళ్‌ చైర్మన్‌ లు ఎక్స్‌ అఫిషియో సభ్యులుగా వ్యవహరించనున్నారు. పీపీసీ మాజీ అధ్యక్షుడు ఎన్‌. రఘువీరా రెడ్డికి కూడా ఈ రెండు కమిటీల్లో స్థానం దక్కింది.

మరింత సమాచారం తెలుసుకోండి: