మాస్ రాజా కి ఉన్న ఎనర్జీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మాంచి జోష్ ఉన్న క్యారెక్టర్ పడితే మన మాస్ రాజా లో ఉన్న ఎనర్జీ టన్నులు టన్నులు బయటకి తన్నుకొస్తుంది. చాలా కాలానికి సరిగ్గా అలాంటి కథ- క్యారెక్టర్ తోనే ఈసారి గోపిచంద్ మలినేని రవితేజను తెరమీద చూపించబోతున్నాడని క్రాక్ టీజర్ చూసి సినిమా ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. మాస్ మహారాజా రవితేజ- మాస్ చిత్రాల దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తాజాగా రూపొందుతోన్న క్రాక్ వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. డాన్ శీను- బలుపు లాంటి సినిమాల తర్వాత మళ్ళీ ఇంతకాలానికి ఈ ఇద్దరి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ సినిమా కావడంతో మాస్ రాజా ఫ్యాన్స్ తో పాటూ ప్రేక్షకులకి మంచి అంచనాలు నెలకొన్నాయి.

 

అందుకు తగ్గట్టే మాస్ మహారాజా రవితేజ పోలీస్ పాత్రలో అదరగొడుతున్నారు. శివరాత్రి సందర్భం గా రిలీజైన క్రాక్ టీజర్ రవితేజ ఫ్యాన్స్ కి మంచి ట్రీట్ ఇచ్చారని చెప్పుకుంటున్నారు. మాస్ రాజా ఎనర్జీ.. తగ్గట్టు టీజర్ ని కట్ చేసి వదిలాడు గోపిచంద్ మలినేని. పక్కా మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా క్రాక్ ని రూపొందించారని తెలుస్తోంది.  ఒంగోల్ లో రాత్రి 8 గంటలకు కరెంట్ పోయిందంటే కచ్ఛితంగా మర్డరే.. అనే వాయిస్ తోనే ఈ సినిమా ఏ రేంజ్ లో ఉండబోతోంది అన్నది తెలియచెప్పాడు. అంతేకాదు డైరెక్టర్ గోపిచంద్ ఒంగోల్ వాసి కావడం తో ఈ సారి కథను ఆ బ్యాగ్డ్రాప్ లో తెరకెక్కించాడని అర్థమవుతోంది.

 

ఇక తాజాగా రిలీజ్ అయిన క్రాక్ టీజర్ లో మాస్ రాజా తన స్టైల్ డైలాగ్స్ తో రేచ్చిపోయాడు. ముఖ్యంగా రవితేజపై మర్డర్ ఎటెంప్ట్ చేసిన ఒక్క సీన్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. అలాగే థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కొత్త ట్రెండ్ క్రియోట్ చేయబోతుందని అర్థమవుతుంది. ఇక ఈ సినిమాకి తమిళ సినిమా సేతుపతి ఇన్‌స్పిరేషన్ అంటూ చెప్పుకుంటున్నారు. ఇక మే 8న ఈ సినిమా భారీ స్థాయిలో విడుదల కానుంది. అయితే ఇడియట్, అమ్మా నాన్నతమిళ అమ్మాయి, వెంకీ, బలుపు, రాజా ది గ్రేట్ వంటి సినిమాల మాదిరిగా ఫ్యాన్స్ థియోటర్స్ లో విజిల్ వేస్తూ సినిమా ఎంజాయ్ చేస్తారని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: