సీనియర్ నటుడు చలపతి కొడుకుగా పరిచయమైన రవిబాబు నటుడిగా మంచి పేరు సంపాదించుకున్నారు. పెద్ద సినిమాలలో పెద్ద హీరోల సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే నటుడి కొడుకు నటుడవడమే కాదు ఆ తర్వాత హీరో అవ్వాలని తాపత్రయపడతారు. కాని రవిబాబు మాత్రం అలా ఆలోచించలేదు. వేరే పంథాలో వెళ్ళాలని ఇదే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇంకో మెట్టు పైకి ఎక్కాలని ఇంకో విధంగా సక్సస్ ని చూడాలని అనుకున్నాడు. నటుడిగా సొనసాగుతూనే స్టేట్స్ లో కొన్నాళ్ళ పాటు డైరెక్షన్ కోర్స్ పూర్తి చేశాడు.

 

అయితే అక్కడితో ఆగిపోతాడని అందరూ అనుకున్నారు. కానీ రవిబాబు అందరికి షాకిచ్చాడు. ఈ.వి.ఈ.వి.సత్యనారాయణ కొడుకు నరేష్ ని హీరోగా పరిచయం చేశాడు. అందరు కొత్తవాళ్ళతో అల్లరి అనే సినిమా తీసి ఇండస్ట్రీ మొత్తం అవాక్కయ్యోలా చేశాడు. చాలా తక్కువ బడ్జెట్ తో తీసిన అల్లరి సినిమా మంచి వసూళ్ళని రాబట్టింది. అంతేకాదు మొదటి సినిమా పేరే నరేష్ కి ఇంటి పేరు అయిపోయింది. ఆ సినిమా నుండి అల్లరి నరేష్ అన్న పేరు ఇండస్ట్రీలో పాపులర్ అయింది. ఆ తర్వాత నుంచి నరేష్ ఎన్నో విజయవంతమైన సినిమాలను చేశాడు. సీనియర్ హీరో డా. రాజేంద్ర ప్రసాద్ తర్వాత మళ్ళీ కంప్లిట్ కామెడీ హీరోగా నరేష్ పాపులర్ అయ్యాడు.

 

అయితే దర్శకుడు రవిబాబు ఎప్పటికప్పుడు వినూత్నమైన ఆలోచనలతో సినిమాలని తెరకెక్కిస్తూ ఇండస్ట్రీలో తన మార్క్ ని క్రియోట్ చేసుకున్నాడు. డిఫ్రెంట్ మేకింగ్ తో సినిమాని తెరకెక్కించి దాదాపు సక్సస్ అయ్యాడు. కాని ఎందుకనో స్టార్ డైరెక్టర్ మాత్రం కాలేకపోయాడు. ముఖ్యంగా రవిబాబు తీసిన సినిమాలలో నచ్చావులే, అనసూయ, సోగ్గాడు ఒక మోస్తారు హిట్ గా నిలిచాయి. వీటిలో కూడా నచ్చావులే మంచి సక్సస్ ని అందుకుంది. కానీ మిగతా సినిమాలన్ని కొత్త తరహాలో ఉన్నప్పటికి ప్రేక్షకులను ఆకట్టుకోవడం లేదు. ఖచ్చితంగా చెప్పాలంటే రవిబాబు సినిమాలలో సెకండాఫ్ బాగా వీక్ గా ఉంటుందని అదే ఆయనకి పెద్ద మైనస్ అవుతుందని ఒక కంప్లైంట్ కూడా ఉంది. ఇక రీసెంట్ గా వచ్చిన ఆవిరి సినిమా కూడా దారుణంగా ఫ్లాపయింది. దీంతో ప్రేక్షకులు రవిబాబుని రక రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.  నీ ప్రయోగాలు ఆపు పందిపిల్ల, ఆవిరి...ఇక చాలు అనవసరంగా ఎందుకు రిస్క్ కొన్నాళ్ళు ఏ.సి రూం లో రెస్ట్ తీసుకో .. జలుబు చేస్తే ఆవిరి అంటూ కామెంట్స్ చేస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: