టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ తేజ్ ఇండస్ట్రీకి తీసుకువచ్చిన అమ్మాయి కాజల్ అగర్వాల్. నందమూరి కళ్యాణ్ రాం హీరో తేజ తెరకెక్కించిన లక్ష్మీ కళ్యాణం సినిమాతో కాజల్ తెలుగు తెరకి పరిచయమై మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్శించింది. ఆ తర్వాత కాజల్ చందమామ. మగధీర సినిమాలతో టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా పాపులర్ అయింది. ఇండస్ట్రీలో స్టార్ హీరోలందరి సరసన నటించి బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందుకుంది. అంతేకాదు కమర్షియల్ చిత్రాల హీరోయిన్ గా కాజల్ క్రేజ్ ని సంపాదించుకోవడమే కాకుండా అతి కొద్ది కాలంలోనే టాలీవుడ్ కోలీవుడ్ లో హైయ్యెస్ట్ రెమ్యూనరేషన్ అందుకున్న హీరోయిన్స్ లిస్ట్ లో కాజల్ చేరడం విశేషం.

 

ఇక ఒక్క మెగా ఫ్యామిలీలోనే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మెగా పవర్ స్టార్ రాం చరణ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ మూవీ ఖైదీ నంబర్ 150 సినిమాలలో నటించడం ఎంతో గొప్ప విషయం. ఇలా టాలీవుడ్ లో చాలా తక్కువమంది హీరోయిన్స్ కి మాత్రమే సాధ్యమైంది. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు, ఎన్.టి.ఆర్, రెబల్ స్టార్ ప్రభాస్, నాగ చైతన్య, రానా దగ్గుబాటి వంటి దాదాపు అందరి హీరోల సరసన నటించిన హీరోయిన్ గా కాజల్ పేరు సంపాదించుకుంది.


 
అంతేకాదు కోలీవుడ్ లోను సూర్య, కార్తీ, ధనుష్, విజయ్ ...వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసి సక్సస్ అయింది. ఇక కాజల్ దర్శకుడు తేజ తోను ఎక్కువ సినిమాలు చేయడం విశేషం. అనుష్క తర్వాత అంతటి పేరుని సంపాదించుకున్న హీరోయిన్స్ లో కాజల్ ఖచ్చితంగా నిలుస్తుంది. ఇక ఇప్పటివరకు కాజల్ ఎలాంటి కాంట్రవర్సీలలో తల దూర్చ లేదు. ఎవరిని అనవసరంగా కామెంట్స్ చేసి బ్యాడ్ హీరోయిన్ అనిపించుకోలేదు. కాని ఒక్క సంఘటన మాత్రం కాజల్ ని చాలా చీప్ అనుకునేలా చేసింది. ఇన్ని సంవత్సరాలలో కాజల్ కి రాని వల్గర్ కామెంట్స్ సీనియర్ సినిమాటోగ్రాఫర్ చోటా కె నాయుడు వల్ల వచ్చింది. పబ్లిక్ ఫంక్షన్ లో స్టేజ్ మీద చటుక్కున కాజల్ ని ముద్దు పెట్టుకోవడం సంచలనం అవడమేకాదు కాజల్ క్యారెక్టర్ ని చాలా దెబ్బతీసింది. 

 

దీంతో ఇండస్ట్రీలో వాళ్ళు అనుకునే మాటలు ఎలా ఉంటాయో తెలిసిందే. ఇవి కాకుండా కాజల్ ఫ్యాన్స్ అండ్ కామన్ ఆడియన్స్ కాజల్ ని చాలా అసహ్యంగా కామెంట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఇప్పటికి కొందరు నెటిజన్ ఆ సంఘటనని ప్రస్తావిస్తూ కాజల్ ని పచ్చిగా కొన్ని మాటలు అడుగుతున్నారట. దీంతో కాజల్ చాలా హర్టయి చోటా చేసిన పనిని తలుచుకొని బాధపడుతుందట. ఇన్ని సంవత్సరాల సక్సస్ ఫుల్ కెరీర్ లో ఇది నిజంగా కాజల్ ఒక మచ్చలా ఉండిపోయింది పాపం.   

మరింత సమాచారం తెలుసుకోండి: