రాజమౌళి సినిమాలు అనగానే వాటికి ఉండే రేంజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. సినిమా నాణ్యత నుంచి ఎంచుకునే నటులు, సినిమా కథ, దానికి చేసే ప్రచారం, తీసుకునే జాగ్రత్తలు ఇలా ప్రతీ ఒక్కటి హైలెట్ గా నిలుస్తు ఉంటాయి. ఇక ఆ సినిమా విషయంలో రాజమౌళి శ్రమ కూడా ఒక రేంజ్ లో ఉంటుంది. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ అనే సినిమాను తెరకేక్కిస్తున్నాడు రాజమౌళి. ఈ సినిమా విషయంలో రాజమౌళి ఎన్నో జాగ్రత్తలు చిన్న విషయంలో కూడా అత్యంత అప్రమత్తంగా ఉంటూ వస్తున్నాడు. 

 

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కీలక దశలో ఉంది. అడవిలో ఒక యుద్ద సన్నివేశాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సీన్ లో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా, ఎన్టీఆర్ కొమరం భీమ్ గా ఆంగ్లేయుల మీద పోరాడే సన్నివేశం చిత్రీకరిస్తున్నారు. రెండు నదులలో ఈ ఫైట్ ఉంటుంది అంటున్నారు. రామ్ చరణ్ పడవలో ఫైట్ చేస్తాడని, ఎన్టీఆర్ చెట్లు మీద నుంచి ఫైట్ చేస్తాడని అంటున్నారు. ఇద్దరూ తుపాకులు బాణాలతో యుద్ధం చేస్తారని, ఇందుకోసమని ఒక ప్రత్యేక ఆయుధాన్ని కూడా జక్కన్న తయారు చేయించాడు అని అంటున్నారు. 

 

ఈ ఫైట్ లో మొత్తం 600 కి పైగా గుర్రాలు కూడా పాల్గొనే అవకాశం ఉందని సమాచారం. ఇక యుద్ద ట్యాంక్ లు కూడా ఉంటాయని అంటున్నారు. కేవలం తమకు ఉన్న పది మంది సైన్యం తో దాదాపుగా 700 మంది తో పోరాటం చేసే సన్నివేశాలు ఉంటాయని అంటున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే సెట్ ఏర్పాటు కూడా పూర్తయినట్టు సమాచారం. ఇక ప్రత్యేకంగా రూపొందించిన కొన్ని పరికరాలు కూడా ఈ ఫైట్ లో మనకు చూపిస్తారని, రాజమౌళి ఇందుకోసం కొన్ని ప్రత్యేక సంకేతాలను హీరోల మధ్య ఉండే విధంగా రూపొందించారు అంటున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: