టాలీవుడ్ లో అక్కినేని, దగ్గుబాటి కుటుంబాల గురించి అందరికి తెలిసిందే. నాటి నుంచి నేటి వరకు కూడా ఈ రెండు కుటుంబాలు ఒక రకంగా టాలీవుడ్ ని శాసిస్తున్నాయి. సిని పరిశ్రమ తొలి నాళ్ళ నుంచి అక్కినేని ఉంటే ఆ తర్వాత దగ్గుబాటి ఫ్యామిలీ అడుగుపెట్టింది. నిర్మాతగా రామానాయుడు ఒక చరిత్ర సృష్టించారు. సురేష్ ప్రొడక్షన్స్ పేరుతో ఎన్నో చిత్రాలను నిర్మించారు. బాలీవుడ్ లో కూడా వారు సినిమా లు నిర్మించారు. 1975 లో, anr తన భార్య పేరిట అన్నపూర్ణ స్టూడియోను స్థాపించారు. 

 

ఆయన చనిపోవడానికి మూడు సంవత్సరాల ముందు, 2011 లో అన్నపూర్ణ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా (AISFM) ను స్థాపించారు. anr కి ఐదుగురు పిల్లలు ఉన్న సంగతి తెలిసిందే. - అక్కినేని నాగార్జున, అక్కినేని వెంకట్ రత్నం, నాగ సుశీలా అక్కినేని, సరోజా అక్కినేని, మరియు సత్యవతి అక్కినేని. ఇక వీరిలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది మన్మథుడు నాగార్జున గురించి. శివ సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టి ఆ తర్వాత అంచెలు అంచెలు ఎదిగి హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. 

 

1984 లో, నాగార్జున... నిర్మాత దగ్గుబాటి రామానాయుడు కుమార్తె లక్ష్మి దగ్గుబాటిని వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి వీరి మధ్య బంధం బలపడింది. టాలీవుడ్ లో అప్పటి వరకు అగ్ర స్థానంలో ఈ ఇద్దరు బంధువులు అయ్యారు. అయితే వీరి వివాహ బంధం మాత్రం ఎక్కువ రోజులు నిలవలేదు అనే చెప్పాలి. నాగార్జున మరియు లక్ష్మి 1992 లో విడాకులు తీసుకున్నారు. వారిద్దరూ తిరిగి వివాహం చేసుకున్నారు, నాగార్జున, అమలను వివాహం చేసుకోగా... లక్ష్మికి కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ శరత్ విజయ్ రాఘవన్ ను వివాహం చేసుకున్నారు. లక్ష్మి, నాగార్జున దంపతులకు పుట్టిన వాడే నాగ చైతన్య.

మరింత సమాచారం తెలుసుకోండి: