ఈ మధ్య కాలంలో స్వీటీ అనుష్క పెళ్లి గురించి సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో విపరీతంగా వార్తలు వైరల్ అవుతున్నాయి. మోస్ట్ బ్యాచిలర్ హీరోయిన్లలో ఒకరైన అనుష్క సూపర్ సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా కెరీర్ మొదలుపెట్టింది. మొదట్లో గ్లామర్ పాత్రలకే పరిమితమైన అనుష్క అరుంధతి సినిమా ఘన విజయంతో అటు గ్లామర్ పాత్రల్లోను, ఇటు అభినయానికి ప్రాధాన్యత ఉన్న పాత్రల్లోను నటిస్తూ వరుస విజయాలు అందుకుంటోంది. 
 
గత కొన్ని రోజులుగా తన పెళ్లి గురించి వార్తలు వస్తూ ఉండటంతో అనుష్క స్పందించింది. టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ తో స్వీటీ పెళ్లి జరగబోతుందని, ఒక యువ క్రికెటర్ ను అనుష్క పెళ్లి చేసుకోబోతుందని వస్తున్న వార్తల గురించి స్పష్టత ఇచ్చింది. అనుష్క మీడియాతో మాట్లాడుతూ తన గురించి ఇలాంటి వదంతులు ఎందుకు వస్తున్నాయో అర్థం కావడం లేదని చెప్పింది. తన పెళ్లి గురించి సోషల్, వెబ్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయడంపై ఆవేదన వ్యక్తం చేసింది. 
 
తాను ఎవరితో ప్రేమలో పడలేదని తన తల్లిదండ్రులు ఎవరిని చూపించి పెళ్లి చేసుకోమంటారో అతడినే పెళ్లి చేసుకుంటానని చెప్పింది. తన పెళ్లి విషయంలో తల్లిదండ్రులే నిర్ణయం తీసుకుంటారని ఇకనైనా అసత్య ప్రచారం ఆపాలని మీడియాకు స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. గతంలోనే అనుష్క, ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. ప్రభాస్, అనుష్క తమకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని తాము స్నేహితులమేనని స్పష్టత ఇచ్చారు. 
 
అ తరువాత స్వీటీ ఒక వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు విపరీతంగా వైరల్ అయ్యాయి. ఆ తరువాత ఈ వార్తలు కూడా నిజం కాదని తేలిపోయింది. తాజాగా ఒక క్రికెటర్ తో అనుష్క ప్రేమలో పడిందని వార్తలు వస్తూ ఉండటంతో అనుష్క ఒకింత ఘాటుగానే తనపై వస్తున్న వార్తల గురించి స్పందించింది. అనుష్క పెళ్లి వార్తల గురించి స్పందించడంతో ఇకనైనా మీడియా అనుష్క గురించి తప్పుడు ప్రచారం ఆపుతుందో లేదో చూడాల్సి ఉంది. అనుష్క ప్రస్తుతం నిశ్శబ్దం అనే సినిమాలో నటిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: