భారతదేశం గర్వించదగిన గాయకుల్లో ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఒకరు. వేల కొద్దీ పాటలను పాడిన ఆయన విదేశీ గాయకులను ఆకట్టుకున్నారు. ఆయన గొంతుపై పరిశోధనలు కూడా చేసారని అంటారు కొందరు. ఎలాంటి పాటను అయినా సులువుగా పాడే నైపుణ్యం ఆయన సొంతం. ఇప్పుడంటే ఇంత మంది గాయకులను టాలీవుడ్ లో చూస్తున్నారు గాని ఒకప్పుడు ఎస్పీ బాలు పాట లేని సినిమా ఉండేది కాదు అంటారు. ఆ విధంగా ఆయన సినీ రంగంలో తనకంటూ చెరగని ముద్ర వేసుకున్నారు. 

 

ఇక ఆయన సోదరి ఎస్పీ శైలజ కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. శైలజ కన్నడలో కూడా ఎక్కువ పాటలు పాడారు. తమిళ,మలయాళ చిత్రాల్లో కల్పి దాదాపు దాదాపు 5వేల పాటలు పాడారు. శైలజ 10వ తరగతికి వచ్చేసరికి, సినీమాల్లో ఆఫర్లు రావడంతో స్టడీకి ఫుల్ స్టాప్ పెట్టి గాయని గా అడుగుపెట్టారు. తన అన్న బాలు సహకారం, జంధ్యాల, విశ్వనాథ్ వంటి అగ్రజుల ప్రోత్సాహం ఆమెకు లభించడంతో విజయవంతమైన గాయనిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం పలు టీవీ షోలకు ఆమె పని చేస్తున్నారు.

 

వీరికి ప్రముఖ నటుడు శుభలేఖ సుధాకర్ కి మధ్య బంధుత్వం ఏర్పడింది. అసలు పెళ్లి ఆలోచన లేని శైలజ కు వివాహం చేయాలని బాలు భావించారు. తమ తండ్రి మరణించడంతో వెంటనే పెళ్లి చెయ్యాలి అనే నిర్ణయానికి వచ్చారు. ఆసమయంలో శుభలేఖ సుధాకర్ పేరును జంధ్యాల సూచించడంతో ఒకే చేసేసారు. నిజానికి సుధాకర్ తో ముఖ పరిచయం ఉన్నా, ఆయన్నే అనూహ్యంగా చేసుకున్నారు శైలజ. ఆ తర్వాత వీరిద్దరూ విడిపోయారు అనే ప్రచారం జరిగింది. శైలజ విషయంలో కూడా అనేక ప్రచారాలు మీడియాలో జరిగాయి. సింగర్ మనో తో ఆమెకు ఎఫైర్ ఉందని వార్తలు వచ్చాయి. సుధాకర్, శైలజ విడిపోయారు అనే ప్రచారానికి ఆ ఇద్దరూ ఎన్నో సార్లు ఖండించినా వార్తలు మాత్రం వస్తూనే ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: