రాజకీయాల్లో గల్లా జయదేవ్, సినిమాల్లో మహేష్ బాబు. ఎవరి రంగంలో వాళ్ళు దూసుకుపోతున్న విధాన౦ అందరికి ఆదర్శమే. విజయవంతమైన వ్యాపారవేత్తగా గల్లా జయదేవ్ రాణిస్తున్న తీరు, ఆ తర్వాత ప్రజల కోసం ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తీరు ఎందరికో ఆదర్శం. విజయవంతమైన వ్యాపారవేత్తగా ఉన్నా సరే ఏదో చెయ్యాలి అనే తపనతో అడుగుపెట్టి, గుంటూరు పార్లమెంట్ నుంచి రెండు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మీద వ్యతిరేకత ఉన్నా సరే ఆయన విజయం సాధించారు. 

 

ఇప్పుడు రెండో సారి ఎంపీగా పార్లమెంట్ లో ఉన్నారు. ఇకపోతే మహేష్ బాబు ప్రస్తుత౦ విజయవంతమైన వ్యాపారవేత్తగా ఉన్నారు. తండ్రి సినీ వారసత్వాన్ని ఆయన నిలబెడుతున్నారు. వరుసగా హిట్ లు కొడుతూ దూసుకుపోతున్నారు. ఆయన హీరోగా సంక్రాంతి కానుకగా వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమా మంచి విజయం సాధించింది. ఇక ఇప్పుడు వంశీ పైడపల్లి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. మహర్షి, భరత్ అను నేను సినిమాలతో మంచి హిట్ లు అందుకున్నాడు మహేష్ బాబు. 

 

ఇక ఇదిలా ఉంటే గల్లా జయదేవ్ కి మహేష్ బాబుకి బంధుత్వం ఉంది. మహేష్ బాబుకి స్వయానా బావ అవుతారు గల్లా జయదేవ్. మహేష్ సోదరి, కృష్ణ కుమార్తె పద్మావతి ఘట్టమనేని ని ఆయన వివాహం చేసుకున్నారు. దీనితో ఈ రెండు కుటుంబాల మధ్య బంధుత్వం ఏర్పడింది. గల్లా జయదేవ్, పద్మావతి దంపతులకు సిద్దార్థ్ గల్లా, అశోక్ గల్లా అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. అశోక్ గల్లా సినిమాల మీద ఆసక్తితో హీరోగా వస్తున్నారు. ఆయన నటిస్తున్న సినిమా ఈ ఏడాది విడుదల కానుంది. ఇక గల్లా జయదేవ్ విషయానికి వస్తే, ఆయన ప్రస్తుతం విజయవంతమైన వ్యాపారవేత్తగా ఉన్నారు. అమర్ రాజా బ్యాటరీస్ కి అధినేత ఆయన. 2014 ఎన్నికల అఫిడవిట్ లో 686 కోట్లను ఆస్తులుగా చూపించారు గల్లా. అప్పట్లో అది సంచలనం.

మరింత సమాచారం తెలుసుకోండి: