దేశంలో అతి పెద్ద మార్కెట్ జరిగే సినీ పరిశ్రమ గా టాలీవుడ్ కి ప్రత్యేక గుర్తింపు ఉన్న సంగతి తెలిసిందే. పెద్ద స్టార్ హీరోలు ఉండటం, స్టార్ వారసులు ఉండటం, స్టార్ దర్శకులు ఉండటంతో బాహుబలి లాంటి ప్రపంచ స్థాయి సినిమాలను తెలుగు చిత్ర సీమ అందిస్తుంది. ఇక ఇదే సందర్భంలో బందుత్వాలతో సినిమాలను ముందుకి నడిపిస్తున్నారు టాలీవుడ్ హీరోలు. ఒకరి సినిమాలకు మరొకరు నిర్మాతలుగా ఉంటూ, అన్నలు, తండ్రులు, బావలు ఇలా దూసుకుపోతున్నారు. దాదాపు అందరు హీరోలు ఇలాగే ఉన్నారు. 

 

దగ్గుబాటి కుటుంబం, అక్కినేని కుటుంబం, ఘట్టమనేని కుటుంబం, నందమూరి కుటుంబం, మెగా కుటుంబం ఇలా సినిమాల్లో నిర్మాతలుగా హీరోలుగా తమదైన ముద్ర వేస్తున్నారు. కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ తో సినిమాలు చేస్తున్నారు. జైలవకుశ సినిమా చేసారు కళ్యాణ్ రామ్. ప్రస్తుతం ఎస్ రాధాకృష్ణ తో కలిసి త్రివిక్రమ్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో సినిమాను చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకి రానుంది. అలాగే రామ్ చరణ్ తన తండ్రితో సినిమాలు చేస్తున్నారు. చిరంజీవి హీరోగా మూడో సినిమాను రామ్ చరణ్ నిర్మాణ సారధ్యంలో తీసుకువస్తున్నారు. 

 

అదే విధంగా సురేష్ బాబు, వెంకటేష్ కాంబినేషన్ లో ఎన్నో సినిమాలు వచ్చాయి. ఇక తన కొడుకు హీరోగా అల్లు అరవింద్ పలు సినిమాలు చేసారు. నాగబాబు నిర్మాతగా రామ్ చరణ్ కూడా ఒక సినిమా చేసారు. కళ్యాణ్ రామ్ బాలకృష్ణ హీరోగా ఒక సినిమా చేసే ఆలోచనలో ఉన్నారు. నాగార్జున కూడా తన కొడుకులతో సినిమాలు చేస్తున్నారు. ఇలా టాలీవుడ్ లో స్టార్లు అందరూ తమ అన్నలు, తమ్ముళ్ళతో సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఇది ఒక ట్రెండ్ గా కూడా ఉంది. పక్కన హీరోలతో కూడా కొన్ని సినిమాలు చెయ్యడానికి కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు. రానా, నాగచైతన్య కాంబినేషన్ లో ఒక సినిమా రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: