చేసింది నాలుగు సినిమాలే అయినా తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు దర్శకుడు సంతోష్ రవీంద్ర కొల్లి అలియాస్‌ బాబీ. తొలి సినిమా పవర్ తోనే తనలో మంచి పవర్ ఉంది అని నిరూపించుకున్నాడు. కెఎస్ రవీంద్ర గురించి వివరాల్లోకి వెళితే గుంటూరుకు చెందిన రవీంద్ర పొలిటికల్ రౌడీ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చి తనదైన టాలెంటుతో స్క్రీన్ రైటర్ గా, స్టోరీ రైటర్ గా, దర్శకుడిగా ఒక్కొక్క మెట్టూ ఎక్కుతూ వచ్చాడు. రవితేజ హీరోగా వచ్చిన ‘పవర్' సినిమాతో బాబీ దర్శకుడిగా మారాడు.

 

వాస్త‌వానికి ద‌ర్శ‌కుడు బాబీది ప్రేమ వివాహం. అంతేకాదు ఈయ‌న ప్రేమ‌క‌థ‌లో ఎన్నో ట్విస్టులు కూడా ఉన్నాయి. బాబీ భార్య పేరు అనూష. ఈమెది క‌మ్మ సామాజిక‌వర్గం. మ‌రియు అనూష తండ్రి ఓ ప్ర‌భుత్వ ఉద్యోగి. ఇక‌ అటు బాబీది కాపు సామాజిక‌వ‌ర్గం. వీరిద్ద‌రిదీ గంటూరే. అయితే బాబీ స్నేహితుడు మ‌రియు అనూష స్నేహితురాలు ల‌వ్ చేసుకున్నారు. ఆ ఇద్ద‌రి ప్రేమ‌కు కోప‌రేట్ చేయ‌డానికి వీరిద్ద‌రూ వెళ్లేవారు. అప్పుడే బాబీ, అనుష‌ల ప‌రిచ‌యం కాస్త ప్రేమగా మారింది. అదే స‌మ‌యంలో బాబీ ఇండ‌స్ట్రీలో అవ‌కాశాల కోసం ట్రై చేస్తుండేవాడు. ఇక‌ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. బాబీ, అనుష‌ల ఫ్రెండ్స్ ల‌వ్ బ్రేక‌ప్ అయింది. కానీ, వీరిద్ద‌రి ల‌వ్‌ మాత్రం సూప‌ర్ స‌క్సెస్ అయింది. 

 

ఇక ఆ త‌ర్వాత వీరిద్ద‌రూ పెళ్లి చేసుకున్నారు.. ఒక పాప కూడా పుట్టింది. వీరి ప్రేమ క‌థ తెలిసిన వారంద‌రూ ఓ సినిమా తీస్తే ఖ‌చ్చితంగా బ్లాక్ బ‌స్ట‌రే అవుతుంద‌ని అంటుండేవారు. నిజంగానే వీరిద్ద‌రి ప్రేమ క‌థ చూస్తే మ‌న‌కూ అదే అనిపిస్తుంద‌నుకోండి.  కాగా, బాబీ ప‌వ‌ర్ సినిమా త‌ర్వాత రెండో సినిమానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ‘గబ్బర్ సింగ్ 2' చేసే అవకాశం దక్కించుకున్నాడు. అయితే ఆ సినిమా డిజాస్టర్ కావడంతో బాబీ కాస్త లయ తప్పాడు. కానీ వెంటనే జూనియర్ ఎన్టీఆర్ హీరోగా జై లవకుశ సినిమా తెరకెక్కించి తన సత్తా ఏంటో నిరూపించుకున్నారు ఈ కుర్ర దర్శకుడు. ఇక జై లవకుశ తర్వాత ఏడాదిన్నర గ్యాప్ తీసుకున్న దర్శకుడు బాబీ.. ఇటీవ‌ల‌ వెంకీమామ అంటూ ప్రేక్షకుల ముందుకు వ‌చ్చి మ‌రో సూప‌ర్ హిట్ అందుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: