తెలుగు సినిమా స్థాయిని మాత్రమే కాదు, ఇండియన్‌ సినిమా స్థాయినే పెంచిన భారీ చిత్రం బాహుబలి. రెండు భాగాలుగా రిలీజ్‌ అయిన ఈ సినిమాలో ప్రభాస్, రానా, అనుష్క, రమ్యకృష్ణ, తమన్నా, నాజర్‌, సత్యారజ్‌లు కీలక పాత్రల్లో నటించారు. అయితే ఇంత భారీ చిత్రాన్ని ఓ కొత్త నిర్మాణసంస్థపై రూపొందించటం విశేషం. నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేనిలు తొలి ప్రయత్నంలోనే చరిత్రను తిరగరాశారు. హేమాహేమీల్లాంటి నిర్మాతలు కూడా చేయని సాహసం చేసి అందరితో ఔరా అనిపించారు.

 

ఆర్కా మీడియా సంస్థను స్థాపించిన శోభు, ప్రసాద్‌లు రాఘవేంద్ర రావు సమర్ఫణలో బాహుబలి సినిమాను నిర్మించారు. తెలుగు సినిమా మార్కెట్‌ కూడా 100 కోట్ల మార్క్‌ను అందుకోని సమయంలో ఏకంగా 350 కోట్లకు పైగా బడ్జెట్‌తో సినిమాను నిర్మించే సాహసం చేశారు. ఫోక్‌లోర్‌ డ్రామాగా తెరకెక్కిన బాహుబలి తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తం చేసింది. బాలీవుడ్‌ సినిమాలకు కూడా సాధ్యం కాని ఎన్నో సరికొత్త రికార్డ్‌  సృష్లించింది బాహుబలి. ఏకంగా 1800 కోట్లకు పైగా వసూళ్లు సాధించి అన్‌ బీటబుల్‌ రికార్డ్‌ ను సెట్ చేసింది. ఒక రకంగా వాళ్లు చేసిన ఆ సాహసమే ఇప్పుడు టాలీవుడ్‌ మార్కెట్‌ను ఈ స్థాయికి తీసుకువచ్చింది. అయితే ఇంత రిస్క్ చేయడానికి కొత్తగా వచ్చిన నిర్మాతలకు అంద ధైర్యం ఎలా వచ్చింది అనుకుంటున్నారా?

 

అయితే ప్రేక్షకులకు శోభు, ప్రసాద్‌లు కొత్త అయిన వారికి ఇండస్ట్రీ కొత్తేం కాదు. శోభు, ప్రసాద్‌లు ఇద్దరు దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావుకు స్వయానా అల్లుళ్లు. అందుకే రాఘవేంద్రరావు సమర్పణలో ఆయన దిశానిర్దేశంలోనే బాహుబలి సినిమాను పట్టాలెక్కించారు. చాలా ఏళ్లుగా ఇండస్ట్రీలో సహ నిర్మాతలుగా కొనసాగుతున్న వీరు బాహుబలితో పూర్తి స్థాయి నిర్మాతలుగా మారారు. తొలి సినిమాతోనే ఇండస్ట్రీని మలుపు తిప్పి అగ్ర నిర్మాతల సరసన నిలిచారు.

మరింత సమాచారం తెలుసుకోండి: