టాలీవుడ్ లో చాలామంది వెండితెర‌పై ఓ వెలుగు వెలిగి రాజకీయాల్లోకి వచ్చి అక్కడ కూడా సక్సెస్ అయ్యారు. గతంలో ఒంగోలు ఎంపీగా గెలిచిన సీనియ‌ర్ న‌టుడు కొంగర జగ్గయ్య నుంచి ఎన్టీఆర్... సూపర్ స్టార్ కృష్ణ, మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది వెండితెర మీద ఓ వెలుగు వెలిగి ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. వీరిలో కొందరు హిట్ అయితే... మరికొందరు ప్లాప్‌ అయ్యారు. ఇక ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టిన‌ప్ప‌టి నుంచి సినిమా రంగానికి, రాజ‌కీయ రంగానికి అవినాభావ సంబంధం ఏర్పడింది.

 

ఇక సినిమా రంగంలో చాలా మంది రాజ‌కీయ నాయ‌కులు కూడా పెట్ట‌బ‌డులు పెడుతున్నారు. మ‌రి కొంద‌రు రాజ‌కీయ రంగంలో ఉన్న వ్య‌క్తుల కుటుంబాల‌కు చెందిన వారు సైతం ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చి రాణిస్తున్నారు. ఉదాహ‌ర‌ణ‌కు గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ మోహ‌న్‌, మంత్రి కొడాలి నాని లాంటి వాళ్లు సినిమాలు కూడా తీశారు. ఇక ఇప్పుడు ఏపీ డిప్యూటీ స్పీక‌ర్‌గా ఉన్న కోన ర‌ఘుప‌తి రిలేష‌న్ సైతం ఇండ‌స్ట్రీలో రాణిస్తోంది.

 

బాప‌ట్ల నుంచి వ‌రుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెల‌వ‌డంతో పాటు ప్ర‌స్తుతం ఏపీ డిప్యూటీ స్పీక‌ర్‌గా ఉన్న కోన ర‌ఘుప‌తి కుమార్తె నీర‌జ కోన ప్ర‌స్తుతం టాప్ హీరోయిన్ స‌మంత‌కు వ్య‌క్తిగ‌త డ్రెస్ డిజైన‌ర్‌గా ఉన్నారు. సమంత వేసుకునే డ్రెస్సుల డిసైన్స్ అన్నింటిని నీర‌జ కోనే డిజైన్ చేయ‌డం.. స‌మంత‌కు మంచి పేరు రావ‌డం జ‌రుగుతోంది. ఇక నీర‌జ కుటుంబంతో సమంత‌కు మంచి అనుబంధం ఉంది.

 

ఇక టాలీవుడ్ టాప్ స్టోరీ రైట‌ర్ కోన వెంక‌ట్ ఎవ‌రో కాదు.. స్వ‌యానా కోన ర‌ఘుపతి అన్న కొడుకే.. ఈ కోన ర‌ఘుప‌తి తండ్రే దివంగ‌త మాజీ స్పీక‌ర్‌, మ‌హారాష్ట్ర మాజీ గ‌వ‌ర్న‌ర్ కోన ప్ర‌భాక‌ర్ రావు. గుంటూరు జిల్లా బాప‌ట్ల‌లో ఈ కుటుంబానికి మంచి పేరు ప్ర‌ఖ్యాతులు ఉన్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: