ఈ త‌రం జ‌న‌రేష‌న్ వాళ్ల‌కు నిన్న‌టి త‌రం మేటి హాస్య‌న‌టుడు ర‌మ‌ణారెడ్డి గురించి తెలియ‌దు కాని... 1970వ ద‌శ‌కంలో ఆయ‌న కామెడీకి పెట్టింది పేరు. రేలంగి - ర‌మ‌ణారెడ్డి జంట కామెడీ అంటే అప్ప‌ట్లో ఓ సంచ‌ల‌నం. ఇక సినిమాలలో రాక మునుపు రమణారెడ్డి నెల్లూరులో శానిటరీ ఇన్స్‌పెక్టరుగా ఉద్యోగం చేస్తుండేవాడు. అది వదిలి పెట్టి సినిమాల్లో చేరాలని మద్రాసు వచ్చాడు. రమణారెడ్డికి ముందు నుంచి మ్యాజిక్‌ సరదా వుండేది. సినిమా వేషాలు దొరకనప్పుడూ, దొరికిన తర్వాత తీరిక దొరికినప్పుడూ, మ్యాజిక్‌ నేర్చుకున్నారు.

 

ఆయ‌న అలా మ్యాజిక్‌తో చాలా చోట్ల ప్రదర్శనలు ఇచ్చారు. శిష్యుల్ని తయారుచేసేవారు. ‘సేవాసంఘాల సహాయనిధికి’ అంటే, ఆ సంస్థ గుణగణాల్ని పరిశీలించి, ఉచితంగా మ్యాజిక్‌ ప్రదర్శనలు ఇచ్చేవారు. ఆయ‌న ఎన్నో వేషాలు వేసి... వ‌య‌స్సు పై బ‌డినా కూడా ఒకే శ‌రీర ఆకృతి మెయింటైన్ చేసేవారు. వ‌య‌స్సు పై బ‌డినా ఆయ‌న మాత్రం లావెక్క లేదు. ఆయ‌న శీర‌రం బొమ్మ తిరిగినట్టు, చేతులూ, కాళ్లూ కావలసిన రీతిలో ఆడించేది. దబ్బున కూలిపోవడం, డభాలున పడిపోవడం రమణారెడ్డికి సాధ్యమైనట్టు తక్కినవాళ్లకి సాధ్యమయ్యేది కాదు. రేలంగి - ర‌మ‌ణారెడ్డి జంట చాలా సినిమాల్లో మంచి కామెడీ పంచేది.

 

ఇక ఆయ‌న అనారోగ్యంతో చిన్న వ‌య‌స్సులోనే 1974 నవంబర్ 11 న మరణించారు. ఆయ‌న అన్న కొడుకే క‌ళాబంధు, కాంగ్రెస్ పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యుడు సుబ్బ‌రామిరెడ్డి. సుబ్బ‌రామిరెడ్డి కేవ‌లం 25 సంవ‌త్స‌రాల వ‌య‌స్సులోనే ఆధునిక దేవాల‌యం అయిన నాగార్జున సాగార్ ప్రాజెక్టును ఆయ‌న క‌న్‌స్ట్ర‌క్ష‌న్ కంపెనీ అయిన గాయ‌త్రి సంస్థ ద్వారా క‌ట్టించారు. అప్ప‌టి భార‌త ప్ర‌ధాన‌మంత్రి ఇందిరాగాంధీ నుంచి ఆయ‌న ఉత్త‌మ కాంట్రాక్ట‌ర్ అవార్డు కూడా అందుకున్నారు. ఆ త‌ర్వాత సుబ్బ‌రామిరెడ్డి ఎన్నో సార్లు కాంగ్రెస్ నుంచి ఎంపీగా గెలిచారు. ఆయ‌న ప‌ర‌మేశ్వ‌రి - మ‌హేశ్వ‌రి ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై ఎన్నో సినిమాలు నిర్మించారు. సినిమా రంగ క‌ళాకారుల‌కు ఆయ‌న ఎన్నోన్నో స‌న్మానాలు చేస్తుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: