యంగ్ హీరో నితిన్, క్రేజీ బ్యూటీ రష్మిక జంటగా నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘భీష్మ’. ఛ‌లో లాంటి సూప‌ర్ డూప‌ర్ హిట్ త‌ర్వాత చాలా గ్యాప్ తీసుకుని ద‌ర్శ‌కుడు వెంకీ కుడుముల డైరెక్ట్ చేసిన ఈ మూవీ శివరాత్రి కానుకగా ప్రేక్షకుల శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి సూప‌ర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా తొలి రోజు తొలి ఆట‌కే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.



తొలి రోజు భీష్మ ఏపీ మరియు తెలంగాణాలలో కలిపి 6.4 కోట్ల షేర్ రాబట్టింది. నితిన్ నటించిన ‘ఆ అ..’మూవీతో రు. 5.6 కోట్ల షేర్ తో నితిన్ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ సాధించాడు. ఇప్పుడు ఆ ఫస్ట్ డే రికార్డ్ ని భీష్మ  బ్రేక్ చేసింది. ఈ సినిమా తొలి రోజు ఏపీ, తెలంగాణ‌లో రు. 6.3 కోట్ల షేర్ సాధించింది. ఇక సినిమాకు సూప‌ర్ హిట్ టాక్ రావ‌డంతో పాటు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఏ సినిమాలు లేక‌పోవ‌డం కూడా క‌లిసి రానుంది.

రెండో రోజు రిపోర్టులు కూడా సినిమా అదిరిపోయే రెస్పాన్స్ వ‌స్తోంద‌ని వ‌స్తుండ‌డంతో ఈ సినిమా నితిన్ కెరీర్‌లో తిరుగులేని బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయ్యే అవ‌కాశాలు ఉన్నాయని ట్రేడ్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. ఇక  సితార ఎంటెర్టైమెంట్స్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ మూవీ కి మహతి స్వర సాగర్‌ మ్యూజిక్ అందించాడు. భీష్మ తొలి రోజు ఏపీ, తెలంగాణ తొలి రోజు వ‌సూళ్లు ఇలా ఉన్నాయి.



‘భీష్మ’ ఆంధ్ర – తెలంగాణ ఫస్ట్ డే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్:

నైజాం -   2.24 కోట్లు

సీడెడ్  -  80.5 లక్షలు

గుంటూరు  -  77.1 లక్షలు

ఉత్తరాంధ్ర - 62 లక్షలు

ఈస్ట్ - 66.5 లక్షలు

వెస్ట్ - 56 లక్షలు

కృష్ణా -  40.5 లక్షలు

నెల్లూరు -  27 లక్షలు
-----------------------------------------------------
ఫస్ట్ డే ఏపీ + తెలంగాణ‌ షేర్  = 6.33 కోట్లు
-----------------------------------------------------

 

మరింత సమాచారం తెలుసుకోండి: