శ్రీరెడ్డి ఈ పేరు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు.   కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్... బూతు మాటలతో తన ప్రత్యుర్థులపై విరుచుకుపడుతూ నానా యాగీ చేస్తుంది.  అప్పట్లో కాస్టింగ్ కౌచ్ పై పెద్ద ఎత్తున ఉద్యమం చేసిన ఈ అమ్మడు తర్వాత తన నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ అందరి చేత తిట్లు తిన్నది.   తెలుగు రాష్ట్రాల్లో శ్రీరెడ్డి చేసిన హడావుడికి టాలీవుడ్ లో ప్రకంపణలు పుట్టుకొచ్చాయి.  ఫిలిమ్ ఛాంబర్ ముందు అర్థనగ్న ప్రదర్శన చేసినా.. పవన్ కళ్యాన్ పై పిచ్చి కూతలు కూసినా అవి శ్రీరెడ్డికే చెల్లాయి. ఆమెపై తెలుగు రాష్ట్రాల్లో విముఖత రావడంతో పక్కరాష్ట్రం చెన్నైకి వెళ్లి పోయింది.  అక్కడ కూడా పలువురు సెలబ్రెటీలపై తన ఇష్టానుసారంగా పోస్టులు పెడుతు నానా హడావుడి చేస్తూ వస్తుంది.  

 

ఈ మద్య శ్రీరెడ్డి అన్నీ మానేసి వంటల ప్రోగ్రామ్ పెట్టుకొని సైలెంట్ గా ఉందని అనుకున్నారు.  తన సొంత యూట్యూబ్ ఛానల్ లో వంటల కార్యక్రమంతో ఆకటుకుంటుంది.  అయితే శ్రీరెడ్డి గోల పోయిందిరా బాబూ అనుకుంటున్న సమయంలో ఈ మద్య డ్యాన్స్ మాస్టర్ రాకేష్ పై , నటి కరాలే కళ్యాన్ పై పచ్చి బూతులు తిడుతూ పోస్ట్ పెట్టింది.  దాంతో చిర్రెత్తుకొచ్చిన వారు.. పోలీస్ స్టేషన్ లో కేసులు కూడా పెట్టారు.  ఈ విషయంపై పోలీసులు ఆమెపై యాక్షన్ తీసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి.  ఇదిలా ఉంటే నిన్న శివరాత్రి సందర్భంగా ఆమె మెడలో భారీగా రుద్రాక్ష మాలలు ధరించి, ఒళ్లంతా బూడిద పూసుకొని, ఒక చేతిలో ఢమరుకం, మరో చేతిలో కర్ర పట్టుకొని నాట్యం చేసింది.

 

ఆమె పక్కన ఇద్దరు కుర్రాళ్లు అఘోరా వేశంలో కనిపించి డ్యాన్స్ చేశారు.  టిక్ టాక్ లో ఫాలోవర్ల సంఖ్య పెంచుకోవడం కోసం శ్రీరెడ్డి ఇలా వీడియో చేసింది. అయితే శివరాత్రి ఎంతో పవిత్రంగా చేస్తారు... అలాంటిది శ్రీరెడ్డి షార్ట్ వేసుకొని ఇలా బరితెగించి డ్యాన్స్ చేయడంపై శివ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీరెడ్డి అవతారంలో భక్తి కనిపించడం లేదని.. కావాలనే ఇలాంటి వివాదాలకు తెర తీస్తుందంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆమెకు దేవుడి శాపం తప్పకుండా తగులుతుందని అంటున్నారు 

మరింత సమాచారం తెలుసుకోండి: