బుల్లి తెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేర్లు, రేష్మీ, అనసూయ, జబర్దస్త్ ద్వారా ఈ ఇద్దరు టాలీవుడ్ లో కూడా హైలెట్ అయ్యారు. సినిమాలు కూడా అప్పుడప్పుడు చేస్తున్నా తమకు పెద్ద పీట వేసిన బుల్లి తెర విషయంలో మాత్రం ఈ ఇద్దరు ఎప్పటికప్పుడు ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. హీరోయిన్ గా అవకాశ౦ వచ్చినా, నటిగా అవకాశం వచ్చినా సరే వీళ్ళు మాత్రం బుల్లి తెర ప్రాధాన్యతను తగ్గించడం లేదు అనేది వాస్తవం. 

 

అయితే వీళ్ళకు ఆశించిన స్థాయిలో సినిమా అవకాశాలు మాత్రం రావడం లేదట. ఈ విషయాన్ని ఈ ఇద్దరు చెప్పకపోయినా మీడియా లో వస్తున్న వార్తలు ఆధారంగా చూస్తే వాళ్లకు అవకాశాలు చాలా తక్కువగా వస్తున్నాయి. ముఖ్యంగా రేష్మీ గురించి ఎవరూ ఆలోచించడం లేదు. హీరోయిన్ రేంజ్ లో ఉన్నా సరే ఆమెను మాత్రం నిర్మాతలు పట్టించుకోవడం లేదనే టాక్ వినపడుతుంది. స్కిన్ షో చేయడానికి రెడీ అయినా కూడా ఆమె ప్రస్తావన ఉండటం లేదు నిర్మాతల్లో అనేది టాలీవుడ్ జనాల మాట. దీనికి కారణం కూడా లేకపోలేదు. 

 

రేష్మీ చేసినవి తక్కువ సినిమాలే అయినా వాటిల్లో ఫ్లాప్ లు ఎక్కువగా ఉన్నాయి. అనసూయ విషయంలో అలా లేదు. రంగస్థలం తర్వాత కొన్ని పాత్రల్లో ఆమె కోసం ప్రత్యేకంగా చర్చలు కూడా జరిగాయి. రంగమ్మ అత్తగా ఆమె నటనకు ఫిదా అయిపోయారు టాలీవుడ్ జనం. ఇప్పుడు ఆమెకు అవకాశాలు వస్తున్నాయి. వరుసగా రాకపోయినా కీలక పాత్రల కోసం ఆమె పేరుని పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా విలన్ పాత్రలు సహా హీరో పక్కన పాత్రల కోసం ఆమె పేరు చర్చల్లో ఉంటుంది. కాని రేష్మీ పేరు మాత్రం ఎక్కడా వినపడటం లేదు. దీనితో ఆమెలో అసహనం ఎక్కువగా ఉందని అంటున్నారు కొందరు. ఆమెకు అవకాశాలు ఇవ్వడానికి ఎవరూ ముందుకి రావడం లేదు కాబట్టి బుల్లితెర కు పరిమితం అవ్వాలని భావిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: