బ్రహ్మానందంకు ఆఫర్లు తగ్గాక టాలీవుడ్ లో యంగ్ కమెడియన్స్ వారి సత్తా చాటుతున్నారు. కొందరు పేరడీలు చేస్తూ సీనియర్ కమెడియన్స్ ను ఫాలో అవుతుండగా కొందరు మాత్రం తమ ఓన్ స్టైల్ తో కామెడీ చేస్తున్నారు. అలాంటి వారిలో చెప్పుకుంటే వెన్నెల కిశోర్ వస్తాడు. వెన్నెల సినిమాతో తెరంగేట్రం చేసిన కిశోర్ ఆ సినిమాలో చూపించిన ఈజ్ కు వరుస అవకాశాలు వచ్చాయి. మొదట్లో యువ హీరోల సినిమాల్లో నటిస్తూ వచ్చిన వెన్నెల కిశోర్ స్టార్ హీరోల సినిమాల్లో కూడా కంపల్సరీ అయ్యాడు.    

  

తనకు ఇచ్చిన పాత్ర చిన్నది అయినా సరే దానికి తన వంతుగా న్యాయం చేస్తాడు వెన్నెల కిశోర్. లేటెస్ట్ గా వచ్చిన భీష్మ సినిమాలో కూడా వెన్నెల కిశోర్ తన సత్తా చాటాడు. నితిన్ వల్ల జీవితంలో అన్ని కోల్పోయే పాత్రలో కనిపిస్తాడు వెన్నెల కిశోర్. ఆ పాత్రలో వెన్నెల కిశోర్ కనిపించిన తీరు భలే అనిపిస్తుంది. హీరో పక్కనే ఉంటూ హీరో ఓడిపోవడాన్ని ఎంజాయ్ చేసే పాత్రల్లో వెన్నెల కిశోర్ నటన ఆడియెన్స్ ను మెప్పిస్తుంది.

 

కావాల్సిన టైం లో పంచులు.. అవసరమైనప్పుడు అమాయకత్వం.. ఇలా మొత్తానికి దర్శకుడు రాసుకున్న పాత్రకు వెన్నెల కిశోర్ సూపర్ హ్యూమర్ యాడ్ చేస్తాడు. భీష్మ సినిమాలో వెన్నెల కిశోర్ తో పాటుగా రహుబాబు పాత్ర కూడా అలానే మెప్పిస్తుంది. ఆయన కామెడీ టైమింగ్ కూడా చాలా బాగుంటుంది. ఇద్దరు కలిసి అదరగొట్టేశారు. సరైన పాత్ర ఇస్తే తను రెచ్చిపోవడం ఖాయమని వెన్నెల కిశోర్ మరోసారి ప్రూవ్ చేశాడు. డైరక్టర్ పెన్నులో పవర్ ఉండాలే కాని తను ప్రేక్షకులను నవ్వించడం గ్యారెంటీ అని మరోసారి ప్రూవ్ చేశాడు వెన్నెల కిశోర్. అందుకే అతనికి వరుస సినిమాలు వస్తున్నాయి.     

మరింత సమాచారం తెలుసుకోండి: