అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ఈ నెల 24 వ తేదీన ఇండియాకు వస్తున్న విషయం తెలిసిందే. తొలిసారి ఆయన ఇండియాకి అమెరికా అధ్యక్షుడి హోదాలో వస్తున్న సందర్భంగా అతనికి మర్యాదలు చేయడానికి చేస్తున్న హంగామా తెలిసిందే. ట్రంప్ బసకు ఒక్కరోజు ఎనిమిది లక్షల వరకు వెచ్చిస్తున్నారట.. ఇప్పటికే ఆయన రాక కోసం అన్ని ఏర్పాట్లూ చకాచకా జరిగిపోతున్న సందర్భంగా, పలు విమర్శలు కూడా తలెత్తుతున్నాయి. ఇకపోతే తాజాగా  రామ్ గోపాల్ వర్మ కూడా కొన్ని పంచ్‌లను తన ట్విట్టర్ ద్వారా పేల్చాడు.. అసలే ఎప్పుడు వివాదాలతో సావాసం చేసే వర్మపై ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైన విషయం తెలిసిందే..

 

 

ఇకపోతే అహ్మదాబాద్, ఆగ్రా, ఢిల్లీ ప్రాంతాలను పర్యటించనున్న సందర్భంగా ట్రంప్, పూర్తి షెడ్యూల్ కొన్ని వారాల క్రితమే ఫిక్స్ అయింది. ఆయనకు స్వాగతం అక్షరాలా కోటిమందితో పలకాలని ప్లాన్ చేస్తున్నారు ప్రధాని మోడీ. ఇక వాషింగ్టన్‌ నుంచి ట్రంప్‌ నేరుగా అహ్మదాబాద్‌ వచ్చి, అక్కడ మోదీతో కలిసి రోడ్‌ షోలో పాల్గొంటారు. అనంతరం మొతెరా క్రికెట్‌ స్టేడియంలో జరిగే ‘నమస్తే ట్రంప్‌’ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత, అక్కడి నుంచి ట్రంప్‌ కుటుంబం నేరుగా ఆగ్రా వెళ్తుంది. సూర్యాస్తమయంలోపు తాజ్‌మహల్‌ను సందర్శించి, అక్కడ దాదాపు ఒక గంట పాటు గడుపిన అనంతరం, ఢిల్లీ పయనమవుతారు.  ఈ నేపథ్యంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన స్టైల్‌లో ట్వీట్ చేసాడు.

 

 

అదేమంటే ట్రంప్‌కు స్వాగతం పలకడానికి కోటిమంది రావాలంటే.. అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, ఆమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్, రజనీకాంత్, కత్రినా కైఫ్, దీపికా పదుకొణె, సన్నీ లియోన్‌లను వరసగా నిలబెడితే.. వాళ్లని చూడడానికి పెద్ద సంఖ్యలో జనాలు వస్తారు. అప్పుడు మీరనుకుంటున్నట్టు కోటిమంది అవుతారు.. లేదంటే  ట్రంప్‌ను చూడటానికి పదో, పరకో జనం వస్తారు అని వ్యంగ్యంగా ట్వీట్ చేసాడు. తాజాగా ఆర్జీవీ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇకపోతే రామ్ గోపాల్ వర్మ చేసిన ట్విట్ చర్చాంశనీయంగా మారింది. ఆ ట్విట్‌ను మీరు కూడ చూడండి.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: