టాలీవుడ్ లెజెండరీ యాక్టర్స్ లో మెగాస్టార్ చిరంజీవి ఒకరు అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. ముందుగా పునాది రాళ్లు సినిమా ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి, ఆ తరువాత కెరీర్ పరంగా మెల్లగా కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కొని, ఆ తరువాత కొన్నాళ్ళకు వచ్చిన ఖైదీ సినిమా ద్వారా తొలిసారిగా అతి పెద్ద విజయాన్ని అందుకున్నారు. ఇక అక్కడి నుండి ఒక్కొక్కటిగా వస్తున్న అవకాశాలను తన ఆకట్టుకునే నటనతో హిట్స్ గా మలుచుకున్న చిరంజీవి, ముందుగా సుప్రీం హీరోగా, ఆపై మెగాస్టార్ గా తిరుగులేని హీరోగా టాలీవుడ్ లో సరికొత్త అధ్యయాన్ని సృష్టించారు. 

 

అయితే మెగాస్టార్ నెంబర్ వన్ హీరోగా ఎన్నో ఏళ్ళు కొనసాగిన తరువాత వచ్చిన తరంలో, ముందుగా హీరోగా హీరోగా పరిచయం అయిన ఆయన తమ్ముడు పవన్, అలానే సూపర్ స్టార్ కృష్ణ కుమారుడు మహేష్, ఇక నటరత్న ఎన్టీఆర్ మనవడు జూనియర్ ఎన్టీఆర్ వంటివారు వరుసగా సినిమాల్లోకి రావడం జరిగింది. ఇక ఒకానొక సమయంలో మెగాస్టార్ రేంజ్ కి వెళ్లి చివర్లో ఈ ముగ్గురూ కూడా తడబడ్డారు, అది ఏయే సినిమాల టైం లో జరిగిందంటే, అప్పటికే తొలిప్రేమ, బద్రి సినిమాలతో సూపర్ సక్సెస్ లు అందుకుని యువతలో విపరీతమైన క్రేజ్ సంపాదించిన పవన్, ఆ తరువాత రెండేళ్లు గ్యాప్ తీసుకుని వచ్చిన జానీ, గుడుంబా శంకర్, బాలు, బంగారం, అన్నవరం వంటి వరుస పరాజయాలతో మెగాస్టార్ రేంజ్ కి వెళ్లే గోల్డెన్ ఛాన్స్ ని మిస్ చేసుకున్నారు. ఇక మహేష్ బాబు కూడా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన పోకిరి తో అతి పెద్ద ఇండస్ట్రీ హిట్ ని అందుకుని, ఆపై వచ్చిన సైనికుడు, అతిధి, ఖలేజా సినిమాల పరాజయాలతో మెగా రేంజ్ కి వెళ్లే అవకాశాన్ని చాలావరకు జారవిడుచుకున్నారు. 

 

ఇక మరొక నటుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా దర్శకదిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సింహాద్రి తో ఎంతో పెద్ద హిట్ అందుకుని గొప్ప మాస్ ఇమేజ్ ని సంపాదించి, ఆ తరువాత వచ్చిన ఆంధ్రావాలా, సాంబ, నా అల్లుడు, నరసింహుడు, అశోక్ వంటి సినిమాల పరాజయాలతో మెగా రేంజ్ క్రేజ్ ని దక్కించుకోలేకపోయారు. ఈ విధంగా ఈ ముగ్గురు హీరోలు కూడా ఒకానొక సమయంలో మెగాస్టార్ రేంజ్ క్రేజ్ సంపాదించి దాదాపుగా నెంబర్ వన్ స్థానం చేరుకున్నప్పటికీ, ఆ తరువాత అనుకోకండా వచ్చిన ఫ్లాప్స్ తో ముగ్గురూ కూడా గోడకు కొట్టిన బంతి వలె వెనక్కువెళ్ళిపోయారు. అయితే ప్రస్తుతం ఈ ముగ్గురికి ఉన్న క్రేజ్, రేంజ్, మార్కెట్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: