రాను రాను సినిమా పరిశ్రమలో పరిస్థితులు ఒకప్పటితో పోలిస్తే మెల్లగా మరింతగా మారిపోతున్నాయి అనేది కొందరు నటీనటులు బహిరంగంగా మీడియా ముఖంగా వెల్లడించలేకపోతున్నప్పటికీ, వారిలో చాలా మంది వ్యక్తం చేస్తున్న నిరాసక్తి, బాధను బట్టి చూస్తే కొంత వరకు అర్ధం అవుతుందని అంటున్నారు సినీ విశ్లేషకులు. అయితే అటువంటి పరిస్థితులకు ముఖ్య కారణం, ఒకప్పటితో పోలిస్తే సినిమా రంగంలోకి ఎప్పటికప్పుడు యువ రక్తం రావడం. కేవలం నటనా విభాగాల్లోని కాకుండా పలు ఇతర సాంకేతిక విభాగాల్లోకి కూడా ఎప్పటికప్పుడు కొత్త వస్తున్నవారు అంతకంతకు పెరగడంతో కాంపిటీషన్ మరింతగా పెరిగి, ఒకప్పటితో పోలిస్తే కేవలం కొందరికి మాత్రమే అవకాశాలు దక్కుతున్నాయని అంటున్నారు. 

 

ఇక మరోవైపు సినిమాలు చూసే ప్రేక్షకుల ఆలోచనలు అభిరుచులు కూడా రాను మారుతున్నాయని కొందరు హీరోయిన్లు సైతం బహిరంగంగా వ్యాఖ్యానిస్తుండడం విశేషం అని అంటున్నారు. ఒకప్పుడు అయితే కథ, కథనాలకు ప్రాధాన్యత ఉండేదని, అయితే ఇప్పటికీ కూడా అటువంటి సినిమాలు అక్కడక్కడా బాగానే నడుస్తున్నప్పటికీ, ఎక్కుగా శృంగారం ఒలకబోసే సినిమాల వైపే ఎక్కువ ప్రేక్షకుల ఆసక్తి ఉంటోందని అంటున్నారు. 

 

ఇక మన టాలీవుడ్ ప్రస్తుత పరిస్థితి చూస్తే, దాదాపుగా ఏ సినిమాలో అయినా హీరోయిన్ కొంతవరకు బట్టలు విప్పి, హీరోలతో లిప్ కిస్ సీన్స్ లో ఏ మాత్రం ఇబ్బంది లేకుండా నటించాల్సిందే అని, అదే బాలీవుడ్ పరిస్థితి అయితే మరింత దారుణం అని, అక్కడ పూర్తిగా బట్టలిప్పి శృంగార సన్నివేశాల్లో నటించాల్సిందే, లేదంటే అవకాశాలు రావు అంటూ కొందరు హీరోయిన్లు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి సినిమా అనేది మనిషి ఎంటర్టైన్మెంట్ కోసం ఏర్పాటు చేసుకున్న సాధనం అని, కానీ ప్రస్తుతం అది మనిషి సరదా కోసం మనిషినే ఒక సాధనంగా మార్చే స్థితికి మారడం నిజంగా శోచనీయం అని అంటున్నారు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: