సినిమాలో హీరో హీరోయిన్స్ కూడా కానంతగా ఫేమస్ అయ్యారు యాంకర్ కం హీరో హీరోయిన్ రష్మీ గౌతం సుడిగాలి సుధీర్. వీళ్ళిద్దరిని చూస్తున్న జనాలు బుల్లితెర మీద ఎంతగా ఎంజాయ్ చేస్తారంటే అమాయక మొహం వేసుకొని సుధీర్ చెప్పే డైలాగ్స్ కి క్యూట్ గా స్మైల్ ఇస్తూ హాట్ గా చూసే రష్మీ కదలనీయకుండా మాయ చేస్తారు. వీళ్ళ పర్ఫార్మెన్స్ కి ఫ్యాన్స్ లక్షల్లో ఉన్నారంటే ఆశ్చర్యపోనవసరం లేదు. ఒకరకంగా చెప్పాలంటే ఢీ షోలో వీళ్ళు చేసే హంగామా సాంగ్స్ లో పర్ఫార్మ్ చేస్తూ చేసే రొమాన్స్ పీక్స్ అని చెప్పాలి. అంతగా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు సుధీర్ రష్మీ.

 

ఇక బుల్లితెరమీద సుధీర్ రష్మీలని చూసి ఎంజాయ్ చేసిన ప్రేక్షకులు వీళ్ళిద్దరు కలిసి పెళ్ళి చేసుకుంటారేమో అని దాదాపుగా ఫిక్సైపోయారు. అంతేకాదు ఒక పెద్ద ఛానల్ లో ఒక కార్యక్రంలో సుధీర్ రష్మీకి పెళ్ళి జరిగినట్టుగా చూపించారు. అది చూసిన చాలా మంది నిజంగా సుధీర్ రష్మీ మొగుడు పెళ్ళాం అయిపోయారని సంబర పడ్డారు. తీరా చూస్తే అది షో అని అర్థమయి డిసప్పాయింట్ అయ్యారు. అంటే వీళ్ళ పెళ్ళి ఎంత హాట్ టాపిక్ గా మారిందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికీ వీళ్ళ మధ్య అసలు రిలేషన్ ఏంటీ అని చాలా మందికి అనుమానాలున్న మాట వాస్తవం.

 

అయితే ఆ అనుమానాలు అనుమానాలే తప్ప నిజాలు కావని చాలా సార్లు సుధీర్ రష్మీ ఎన్నోసార్లు క్లారిటి ఇచ్చారు కూడా. అయినా జనాలు వీళ్ళు చెప్పే మాటలు నమ్మడం లేదు. ఇక షో రష్మీ తో ప్రతీసారి ఒక అద్భుతమైన డైలాగ్ చెబుతుటాడు. రష్మీ నేను చచ్చిపోతే నువ్వేడుస్తావో తెలీదు గాని నువ్వేడిస్తే మాత్రం నేను చచ్చిపోతా అంటూ చెబుతుంటాడు. రష్మీ ని చూస్తూ సుధీర్ ఎక్స్ప్రెషన్ ఇవ్వగానే అందరూ ఇదే డైలాగ్ చెప్తాడని ఫిక్సవుతారు. అయితే రష్మీ కూడా నీకు జీవితంలో నేను పడను. అంత ఛాన్స్ నీకివ్వను ..నువ్వు నా విషయంలో జీవితాంతం 'నేను చచ్చిపోతే నువ్వేడుస్తావో లేదో తెలీదుగాని నువ్వేడిస్తే మాత్రం నేను చచ్చిపోతా' డైలాగ్ చెప్పుకొని బ్రతకాల్సిందే అని అంటుంటుంది. ఒకవేళ రష్మీ కి మ్యారేజ్ అయితే ఈ సుడిగాలి సుధీర్ సుడిగాలిలా తిరుగుతూ అదే డైలాగ్ చెబుతుంటాడేమో.  ఇక షో లో ఈ మధ్య కాలంలో రష్మీ, ప్రదీప్ లను చూస్తుంటే సుధీర్ కి బాధగా ఉంటుందట. ఇద్దరు కలిసి నన్ను బఫూన్ చేసి ఆడుకుంటున్నాడట. 

మరింత సమాచారం తెలుసుకోండి: