టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఒక సినిమా నిర్మిస్తున్నారంటే ఇండస్ట్రీతో పాటు ప్రేక్షకుల్లోను ఆసక్తి నెలకొంటుంది. అలా ఆయన సినిమా మీద ఒక సక్సస్ అనే ముద్రని వేశారు దిల్ రాజు. సకుటుంబ సపరివారంగా సినిమా చూడగలుతుంది ప్రస్తుతానికి దిల్ రాజు బ్యానర్ నుండి వస్తున్న సినిమాలే. అదే ఆయనకి సక్సస్ ఫుల్ ప్రొడ్యూసర్ ని చేసింది. ఇండస్ట్రిలో ఏ హీరో అయినా ఆలోచించకుండా డేట్స్ సర్ధుబాటు చేస్తారంటే అది దిల్ రాజుకి మాత్రమే. చిన్న హీరోలతో తక్కువ బడ్జెట్ సినిమాలు అలాగే ప్రభాస్, ఎన్.టి.ఆర్, అల్లు అర్జున్, మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రాం చరణ్ వంటి స్టార్ హీరోలతోను భారీ బడ్జెట్ సినిమాలని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఆయన కల అయిన పవన్ కళ్యాణ్ తో సినిమా ని భారీ బడ్జెట్ నిర్మిస్తున్నారు.

 

అంతేకాదు జెర్సీ సినిమాను బాలీవుడ్ లో నిర్మించనున్నారు. షాహిద్ కపూర్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. తెలుగులో నేచురల్ స్టార్ నాని నటించిన జెర్సీ కమర్షియల్ గా హిట్ అవకపోయినప్పటికి నిర్మాతకి నష్టాలను మాత్రం ఇవ్వలేదు. అంతేకాదు ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. అందుకే బాలీవుడ్ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా కథలో కొన్ని మార్పులు చేర్పులు చేసి రూపొందిస్తున్నారు. ఇక ఈ సినిమాతో బాలీవుడ్ లో మంచి సక్సస్ ని అందుకొని అక్కడ వరుసగా సినిమాలు చేయాలని దిల్ రాజు ఇప్పటికే ప్లాన్ చేస్తున్నారు. 

 

ఇదిలా ఉంటే కమర్షియల్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఎఫ్ 2 కి సీక్వెల్ గా ఎఫ్ 3 సినిమాని తెరకెక్కించాలన్న ప్లాన్ లో ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ఎఫ్ 2 విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లతో తెరకెక్కించి బ్లాక్ బస్టర్ ని అందుకున్నాడు అనిల్ రావిపూడి. అంతేకాదు ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లో చేరిన సంగతి తెలిసిందే. అందుకే ఈ సారి ముగ్గురు హీరోలతో ఎఫ్ 3 ని ప్లాన్ చేశారు. అయితే మూడవ హీరోగా మహేష్ బాబు చేస్తారని తన స్క్రిప్ట్ తో అనిల్ మహేష్ బాబు ని ఒప్పించాడని వార్తలు వస్తున్నాయి. అయితే ఇందులో అక్షరం కూడా వాస్తవం లేదని మేకర్స్ క్లారిటి ఇచ్చారు. 

 

మహేష్ ప్రస్తుతం వంశీ పైడి పల్లి సినిమా తప్ప ఇంకోక సినిమా ఏదీ కమిట్వలేదని సమాచారం. అయితే అనిల్ సరిలేరు తెరకెక్కించిన విధానం మహేష్ ని బాగా ఆకట్టుకోవడం వల్లే అనిల్ కి మళ్ళీ డేట్స్ ఇచ్చాడని ప్రచారం సాగుతోంది. ఇది వట్టి ప్రచారమేనని  తేలిపోయింది. ఒకవేళ మహేష్ బాబు ఎఫ్ 3 లో నటించాలని అంటే ఇక్కడున్న పెద్ద సమస్య కేవలం 20 నిముషాల పాత్ర మాత్రమే మూడవ హీరోకి ఉంటుందట. అలాంటి పాత్రని మహేష్ ఒప్పుకునే సమస్యే లేదు. ఒకవేళ దిల్ రాజు గనక ఒప్పించగలిగితే భారీ మొత్తం లో రెమ్యూనరేషన్ ఆఫర్ చేస్తే తప్ప సూపర్ స్టార్ ఒప్పుకోవడం కష్టమని అంటున్నారు. ఒకవేళ ఆ 20 నిముషాల క్యారెక్టర్ ఒప్పుకుంటే మాత్రం నభూతో న భవిష్యత్ అని ఖచితంగా అనాల్సిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: