అవును.. అక్కినేని నాగార్జున రెండో కుమారుడు అఖిల్ తో దగ్గుబాటి వెంకటేష్ కూతురు పెళ్లి అని ఎన్నో రోజుల నుండి జరుగుతున్న ప్రచారం ఇది.. వీళ్ళ పెళ్లి గురించి సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే ఉంటాయి.. అదేం అంటే చాలు.. అఖిల్ అందంగా ఉన్నాడు.. వెంకటేష్ కూతురు అందంగా ఉంది.. అంతేకాకుండా అఖిల్ వెంకటేష్ వరుసకు అల్లుడు అవుతాడు.. ఆ వరుసలు కలిపేస్తే సొంత అల్లుడు అయిపోతాడు కదా అని అంటున్నారు నెటిజన్లు. 

 

దీనికి కారణం గతంలో వీరి బంధుత్వమే.. ఏంటి వీళ్లకు బంధం ఉందా? అది ఎలా? అని అనుకుంటున్నారు కదా! కానీ నిజం అండి.. అక్కినేని నాగార్జున దగ్గుబాటి వెంకటేష్ ఇద్దరు సొంత బావ బామ్మర్దులు.. ఎలా అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్న.. గతంలో అంటే 1984 సమయంలో దగ్గుబాటి రామానాయుడు కుమార్తె లక్ష్మిని.. అక్కినేని నాగేశ్వర రావు రెండో కుమారుడు అయినా నాగార్జునకు ఇచ్చి పెళ్లి చేశారు. 

 

అయితే కొన్ని కారణాల వల్ల వారి పెళ్లి పట్టుమని 6 ఏళ్ళు కూడా నిలవలేదు.. అందుకే ఇద్దరు విడాకులు తీసుకొని మళ్లీ పెళ్లి చేసుకున్నారు. నాగార్జున అమలను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. అలాగే లక్ష్మి కూడా మరొకరిని పెళ్లి చేసుకుంది. ఇలా వెంకటేష్.. నాగార్జున బావ బామ్మర్దులు. అయితే అప్పుడు చెడిన బంధం ఇప్పుడు మళ్లీ చిగురించాలని.. వారి తండ్రి కోరిక మేరకు రెండు కుటుంబాలు బంధుత్వంతో కలిసిమెలసి ఉండాలని వెంకటేష్.. నాగార్జున కోరుకుంటున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. 

 

అయితే అఖిల్ అక్కినేని పెళ్లి వెంకటేష్ కుమార్తెతో జరగటం అంత మంచిది కాదు అని కూడా వాదనలు వినిపిస్తున్నాయి. గతంలోనే వీరి బంధుత్వం ఎక్కువ కాలం నిలవలేదు. ఇప్పుడు మళ్లీ అవసరమా అంటూ కొందరు సినీ ప్రముఖులు కూడా చెప్తున్నట్టు సమాచారం. మరో వైపు అక్కినేని అఖిల్ అభిమానులు ఈ పెళ్లి జరిగితే బాగుంటుంది అంటూ కోరుకుంటుంటున్నారు. మరి చివరికి అఖిల్ ఎవరితో పెళ్లి అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: