స్టార్ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకోవడం అంటే మాములు విషయం కాదు. కొందరికి మొదటి సినిమాతోనే లక్ కలిసి వస్తే మరికొందరికి మూడు నాలుగు సినిమాలు చేస్తేనే కాని ఆ క్రేజ్ రాదు. మొదటి రెండు సినిమాలు ఫ్లాపైన మూడవ సినిమా నుండి రూటు మార్చి ప్రస్తుతం తెలుగులో టాప్ లీగ్ లో ఉన్న క్రేజీ హీరోయిన్ పూజా హెగ్దె లిప్ లాక్ సీన్స్ పై తన వర్షన్ చెప్పుకొచ్చింది.  ముకుంద, ఒక లైలా కోసం సినిమాలు ఫ్లాప్ అవడంతో నిరాశచెందిన ఈ అమ్మడు బాలీవుడ్ లో హృతిక్ రోషన్ హీరోగా మొహెజోదారో సినిమా ఆఫర్ రాగానే ఎగిరి గంతులేసింది.

 

అయితే ఆ సినిమా కూడా డిజాస్టర్ అయ్యింది. అంతేకాదు ఆ సినిమాలో హృతిక్ తో లిప్ లాక్ సీన్ కోసం తాను చాలా ఇబ్బంది పడ్డానని చెబుతుంది పూజా హెగ్దె. ఒకరి పెదాలను మరొకరు అప్పచెప్పుకోవడం అంటే అది మాములు విషయం కాదు. ఆ సీన్ డైరక్టర్ చెప్పినప్పుడు ఓకే అని చెప్పినా షూటింగ్ చేస్తున్నప్పుడు చాలా సిగ్గుగా అనిపించింది. యూనిట్ అంతా చూస్తున్న ఆ టైంలో మరొకరికి పెదాలు అప్పచెప్పడం అంటే ఎంతైనా ఇబ్బందికరమే అంటుంది పూజా హెగ్దే.

 

మొహెంజోదారో సినిమాలోని తన లిప్ లాక్ అనుభవాన్ని చెబుతూ ఇక మీదట లిప్ లాక్స్ విషయంలో జాగ్రత్తగా ఉంటానని చెబుతుంది. సాధ్యమైనంత వరకు లిప్ లాక్ లేకుండా ఉండేలా చూసుకుంటా అని అంటుంది పూజా. లిప్ లాక్ లేకున్నా అమ్మడు అందాల ప్రదర్శనతో సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుంది. అల్లు అర్జున్ అల వైకుంఠపురములో కూడా తొడల అందాలతో పూజా హెగ్దే కుర్రాళ్లను తెగ డిస్ట్రబ్ చేసింది. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా వస్తున్న జాన్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది ఈ అమ్మడు.

మరింత సమాచారం తెలుసుకోండి: