‘భీష్మ’ మూవీ హిట్ టాక్ తెచ్చుకోవడంతో దర్శకుడు వెంకీ కుడుమల మంచి జోష్ లోఉన్నాడు. ఈ మూవీకి వచ్చిన పాజిటివ్ టాక్ పూర్తి సద్వినియోగం చేసుకుని  ఈ మూవీకి కలెక్షన్స్ విషయంలో కూడ మంచి విజయం దక్కెలా దర్శకుడు వెంకీ కుడుమల ఈ మూవీకి సంబంధించి ప్రమోషన్స్ భారీగా చేస్తున్నాడు.  


‘ఛలో’ తో సక్సస్ కొట్టిన వెంకీ ‘భీష్మ’ తో కూడా ఆ సక్సస్స్ కంటిన్యూ చేసినట్లుగా కనిపించడంతో సాధారణం ఇండస్ట్రీలోని దర్శకులను వెంటాడే ద్వితీయ విఘ్ననాన్ని దాతుకున్నాడు. ఈ సినిమాకు అన్ని చోట్ల నుండి పాజిటివ్ రెస్పాన్స్  వస్తున్న నేపధ్యంలో ఈ మూవీ బయ్యర్లు మంచి జోష్ లో ఉన్నారు.  


ఇలాంటి పరిస్థితులలో  కొన్ని రోజుల క్రితం వెంకీ కుడుమల పై నాగశౌర్య చేసిన కామెంట్స్ సంబంధించి మళ్ళీ మీడియా నుండి ప్రశ్నలు ఎదురు కావడంతో వెంకీ కుడుమల విభిన్నంగా స్పందించాడు. నాగశౌర్య తనకు భహుమతిగా  ఇచ్చిన కారు ఇప్పటికి తన వద్దనే ఉందని తన మొదటి సినిమా సక్సస్ గుర్తుగా ఇచ్చిన కారు తన వద్ద తీపి గుర్తుగా తన వద్ద ఇప్పటికి తన వద్దనే ఉందని అయితే ఆ కారును అలాగే ఉంచుకుంటాను కాని ఆ కారులో తిరిగను అంటూ కామెంట్స్ చేసి మరో ట్విస్ట్ ఇచ్చాడు.


దీనితో ఆ ఇంటర్వ్యూను నిర్వహిస్తున్న ఆ మీడియా ప్రతినిధులు నాగశౌర్య గురించి ఇంకా లోతుగా అడిగేందుకు ప్రయత్నించగా తెలివిగా వెంకీ కుడుమల టాపిక్ డైవర్ట్ చేశాడు.  దీనితో తనకు కార్ ను బహుమతిగా నాగశౌర్య ఇచ్చాడు అని చెపుతూనే మరోవిధంగా ఆ కారు  లో తిరగను అంటూ వెంకీ కుడుమల చేసిన కామెంట్స్ మీడియాకు హాట్ టాపిక్ గా కొనసాగుతున్నాయి. దీనితో వీరిద్దరి మధ్య ఏర్పడిన గ్యాప్ ఇప్పట్లో సమసిపోయే ఆస్కారం కనిపించడం లేదు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: