ఉదయభాను తర్వాత బుల్లితెర మీద హాట్ యాంకర్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న భామ జబర్దస్త్ అనసూయ. ఆ షోలో కామెడీతో పాటుగా అనసూయ చేసే అందాల ప్రదర్శనను ఎంజాయ్ చేస్తారు ఆడియెన్స్. జబర్దస్త్ షోతో ఆ కమెడియన్స్ మాత్రమే కాదు అనసూయ కూడా చాలా పాపులర్ అయ్యింది. ఆ షో ద్వారానే సినిమాల్లో అవకాశాలు కూడా తెచ్చుకుంటుంది అమ్మడు. అయితే బుల్లితెర మీద గ్లామర్ ఒళకపోయే ఈ అమ్మడు సినిమాల్లో మాత్రం డిఫరెంట్ రోల్స్ ట్రై చేస్తుంది. 

 

ఇక లేటెస్ట్ గా జబర్దస్త్ షో నుండి అనసూయ ఎగ్జిట్ అవుతున్న వార్త ప్రస్తుతం హాట్ న్యూస్ గా మారింది. జబర్దస్త్ షో నుండి నాగబాబు బయటకు వెళ్లడం ఆయనతో కొంతమంది టీం లీడర్స్ ను కూడా తీసుకెళ్లడం జరిగింది. అయితే అదే టైం లో జీ తెలుగులో అదిరింది షోని వీళ్లంత కలిసి చేస్తున్నారు. అదిరింది షోకి పెద్దగా రేటింగ్ రావట్లేదు. అందుకే అనసూయని తెచ్చి ఆ షోకి యాంకర్ ను చేయాలని అనుకుంటున్నారట. జబర్దస్త్ నుండి అనసూయ వెళ్తే ఇప్పుడు ఎక్స్ ట్రా జబర్దస్త్ చేస్తున్న రష్మినే జబర్దస్త్ కు యాంకర్ గా కొనసాగిస్తారట.

 

అదిరింది తో పాటుగా జీ తెలుగులో లోకల్ గ్యాంగ్స్ షోకు అనసూయ వర్క్ చేస్తుంది. అందుకే ఆది అప్పుడప్పుడు తన పంచుల్లో అనసూయ తెలివిగల్లది కాబట్టే అక్కడ ఇక్కడ మ్యానేజ్ చేస్తుందని అంటాడు. అయితే ప్రస్తుతం మల్లెమాల వారు ఇచ్చే దాని కన్నా డబుల్ ఆఫర్ అనసూయకు జీ తెలుగు వారు ఇస్తున్నారట. నేడో రేపో సడెన్ సర్ ప్రైజ్ గా అనసూయ జబర్దస్త్ కు గుడ్ బై చెప్పి అదిరిందిలో దర్శనమిస్తుందని అంటున్నారు. మరి రెమ్యునరేషన్ ఎక్కువ ఎవరు ఇస్తే వారికి చేసే యాంకర్లు ఇలా షోలు మారడంలో తప్పేం లేదని కొందరి మాట.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: