బుల్లితెర మీద వచ్చిన ఇమేజ్ ను క్రేజ్ ను సిల్వర్ స్క్రీన్ పై వాడుకోవాలని అనుకోవడం తప్పేం లేదు. కాని ఆ విషయంలో కొన్ని ఫార్ములాలు పాటించాల్సి ఉంటుంది. స్మాల్ స్క్రీన్ పై ఆల్రెడీ ఓ ఐడెంటిటీ తెచ్చుకున్న వారు సినిమా హీరోగా మారాలని అనుకుంటే కొత్త కాన్సెప్ట్ తో వస్తే తప్పకుండా వారికి ఉన్న ఫాలోయింగ్ కు బాగా వర్క్ అవుట్ అవుతుంది. అలా కాకుండా రొటీన్ గా తాము కూడా మరో మెగాస్టార్, సూపర్ స్టార్ అన్నట్టుగా బిల్డప్ ఇస్తే రిజల్ట్ ఎలా ఉంటుందో సుడిగాలి సుధీర్ హీరోగా చేసిన సాఫ్ట్ వేర్ సుధీర్ ఫలితం చూస్తే తెలుస్తుంది.

 

జబర్దస్త్ షోతో పాపులర్ అయిన సుధీర్ తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ చూసుకుని తాను హీరోగా ఏం చేసినా నడిచిపోద్దని అనుకున్నాడు. కాని అది వర్క్ అవుట్ అవలేదు. సాఫ్ట్ వేర్ సుధీర్ మాత్రమే కాదు ఆ తర్వాత జబర్దస్త్ త్ర్యం సుధీర్, గెటప్ శ్రీను, రాం ప్రసాద్ ముగ్గురు కలిసి 3 మంకీస్ అని తీసినా జనాలు ఆదరించలేదు. అయితే ఈ క్రమంలో సుధీర్ లానే యాంకర్ గా చేస్తూ హీరోగా మొదటి ప్రయత్నం చేస్తున్నాడు ప్రదీప్ మాచిరాజు. అతను చేస్తున్న 30 రోజుల్లో ప్రేమించడం ఎలా..? సినిమా ప్రమోషన్స్ షురూ చేశాడు.

 

సినిమాలోని నీలి నీలి ఆకాశం సాంగ్ సూపర్ హిట్ కాగా ఆ సాంగ్ తోనే ప్రేక్షకుల్లో సినిమాపై ఓ అంచనాలను ఏర్పరిచాడు ప్రదీప్. మున్నా డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా ప్రమోషన్స్ చూస్తే ప్రదీప్ సక్సెస్ అందుకోవడం గ్యారెంటీ అనేలా ఉన్నాడు. హీరోగా సుధీర్ ఫెయిల్ కాగా ప్రదీప్ పర్ఫెక్ట్ ప్లానింగ్ తో తనకున్న అన్ని పరిచయాలను వాడేస్తూ సక్సెస్ అందుకునేలా ఉన్నాడు. మరి సుధీర్ ఇకమీదట హీరోగా చేయాలనుకుంటే ప్రదీప్ ను ఫాలో అయితే బెటర్ అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: