కృష్ణంరాజు బాపు ల కాంబినేషన్ లో వచ్చిన ‘భక్తకన్నప్ప’ క్లాసిక్ మూవీ. మహాశివరాత్రి వచ్చిందంటే చాలు ఈ మూవీని ఏదోఒక ఛానల్ లో టెలికాస్ట్ చేస్తూనే ఉంటారు. కృష్ణంరాజుకు విపరీతమైన పేరు తెచ్చిపెట్టిన ఈ మూవీని ప్రభాస్ తో రీమేక్ చేయాలని కృష్ణంరాజు జీవిత ఆశయం.


‘బాహుబలి’ తో నేషనల్ సెలెబ్రెటీగా మారిపోయిన ప్రభాస్ ని ‘భక్తకన్నప్ప’ రీమేక్ లో నటింపచేయడానికి ఇప్పటికీ ప్రభాస్ పై తన ఒత్తిడి కొనసాగిస్తూనే ఉన్నాడు. ఇలాంటి పరిస్థితులలో మొన్న మహాశివరాత్రి రోజున మోహన్ బాబు ‘భక్తకన్నప్ప’ మూవీని తిరిగి మంచు విష్ణు హీరోగా 60 కోట్ల బడ్జెట్ తో రీమేక్ చేయబోతున్నట్లు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చాడు. 


వాస్తవానికి ఈ న్యూస్ ఇప్పటి విషయం కాదు గత కొన్ని సంవత్సరాలుగా ఈ మూవీని తాను రీమేక్ చేయబోతున్నాను అంటూ మంచు విష్ణు ఓపెన్ గా అంటూనే ఉన్నాడు. తనికెళ్ళ భరణి ఈ మూవీకి స్క్రిప్ట్ వ్రాసిన విషయం కూడ ఇప్పటికే అనేకసార్లు విష్ణు లీకులు ఇచ్చాడు. అయితే ఆ తరువాత మంచు విష్ణు రచించిన నటించిన సినిమాలు అన్నీ ఫెయిల్ అవ్వడంతో అతడి మార్కెట్ పూర్తిగా పడిపోయింది. 


దీనితో ఇప్పుడు మోహన్ బాబు చేసిన ప్రకటన ఎవరికీ నమ్మసక్యంగా అనిపించడం లేదు. 60 కోట్ల బడ్జెట్ తో మూవీ అంటే కనీసం ఆ మూవీకి 100 కోట్ల గ్రాస్ కలక్షన్స్ వచ్చితీరాలి. ఈ పరిస్థితులలో ఏమాత్రం మార్కెట్ లేని విష్ణు నటించే ‘కన్నప్ప’ మూవీని ఎవరు ధైర్యం చేసి కొంటారు అంటూ చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం విష్ణు తన భార్య వెరొనికా ను నిర్మాతగా ‘మోసగాళ్లు’ అనే సినిమా చేస్తున్నాడు. ఈమూవీ తరువాత ‘కన్నప్ప’ ఉంటుందా లేదా అన్నది రానున్న రోజులలో క్లారిటీ వస్తుంది. ఇప్పుడు మోహన్ బాబు ఈ ప్రకటన చేయడంతో కృష్ణంరాజు ‘భక్తకన్నప్ప’ విషయమై రాజీ పడిపోతాడా లేదంటే మోహన్ బాబుకు పోటీగా తాను కూడ మరొక ‘కన్నప్ప’ తీస్తాడా అన్న విషయమై ప్రస్తుతానికి సస్పెన్స్..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: