ఈ వారం టాలీవుడ్ లో బెస్ట్ మూమెంట్స్ గురించి చెప్పుకుంటే ఇన్నాళ్లు బ్యాచిలర్ గా ఉన్న యువ హీరో నితిన్ లైఫ్ లోకి తన జీవిత భాగస్వామి వచ్చింది. విజయ నిర్మల జయంతి సందర్భంగా ఆమె విగ్రహాన్ని ఏర్పాటు చేశారు విజయ నిర్మల తనయుడు నరేష్. నితిన్ భీష్మ సక్సెస్ ఫుల్ టాక్. త్రివిక్రం, ఎన్.టి.ఆర్ కలిసి మరో మూవీ ఎనౌన్స్ చేశారు. ఇక వీటి మ్యాటర్ లోకి వెళ్తే..

 

నితిన్ షాలిని ఎంగేజ్మెంట్ : 

 

యువ హీరో నితిన్ తన సోల్ మేట్ ను వెతుకున్నాడు. 8 ఏళ్ల పరిచయం.. 5 ఏళ్లు ప్రేమిస్తున్న షాలినితో నితిన్ ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. జంట చూడముచ్చటగా ఉందని అందరు అంటున్నారు. కొన్నాళ్లుగా సీక్రెట్ గా ప్రేమించుకున్న ఈ ఇద్దరు తమ ప్రేమని పెద్దలు అంగీకరించడంతో పెళ్లితో ఒకటవనున్నారు. 

 

ఇక ఈ వారం నితిన్ కు మరో సర్ ప్రైజ్.. భీష్మ సూపర్ హిట్. వెంకీ కుడుముల డైరక్షన్ లో వచ్చిన భీష్మ సినిమా శుక్రవారం రిలీజై హిట్ టాక్ తెచ్చుకుంది. షాలినితో ఎంగేజ్మెంట్ నితిన్ కు హిట్ ఇచ్చింది. ఇక పెళ్లి తర్వాత మనోడి ఫేట్ మారిపోతుందేమో చూడాలి.

 

విజయ నిర్మల విగరాహావిష్కరణ :

 

ఇటీవల మరణించిన నటి, దర్శక నిర్మాత గిన్నీస్ బుక్ అవార్డ్ గ్రహీత విజయ నిర్మల జయంతి సందర్భంగా ఆమె జ్ఞాపకార్ధంగా నానక్ రాం గూడ ఆమె నివాసం వద్ద కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహావిష్కరణ వేడుకలో సూపర్ స్టార్ కృష్ణ, మహేష్, కృష్ణం రాజు, సిని రాజకీయ పరిశ్రమకు సంబందించిన కొందరు ప్రముఖులు అటెండ్ అయ్యారు. 

 

విజయ నిర్మలని తలచుకుంటూ నరేష్, కృష్ణ, మహేష్ మాట్లాడిన మాటలు అందరిని కంటతడి పెట్టించింది.

 

త్రివిక్రం ఎన్.టి.ఆర్ మూవీ ఎనౌన్స్ మెంట్ :

 

అల వైకుంఠపురములో సక్సెస్ జోష్ లో ఉన్న త్రివిక్రం తన నెక్స్ట్ సినిమా ఎవరితో చేస్తాడన్న చిన్న కన్ ఫ్యూజన్ ఉంది. అయితే తారక్ తో సినిమాకు లైన్ క్లియర్ అవగా అఫిషియల్ గా చెప్పలేదు. అయితే నందమూరి ఫ్యాన్స్ ఎదురుచూసిన ఆ ఎనౌన్స్ మెంట్ ఈ వారం వచ్చింది. తారక్, త్రివిక్రం మళ్లీ కలిసి పనిచేస్తున్నారు. ఈ సినిమాకు హారిక హాసినితో పాటుగా ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో కళ్యాణ్ రాం కూడా ఒక నిర్మాతగా ఉంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: