బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న భారీ బడ్జెట్ మూవీ RRR. ఈ సినిమా రిలీజ్ విషయంలో అభిమానుల ఆశల మీద నీళ్లు చల్లిన రాజమౌళి ఆ నష్టాన్ని పూడ్చేందుకు చిన్న చిన్న లీకులు ఇస్తున్నాడు. లేటెస్ట్ గా సినిమా నుండి రాం చరణ్, అలియా భట్ ల ఫోటోలు లీక్ అయ్యాయి. వాటిపై చిత్రయూనిట్ ఎలా రియాక్షన్ ఇవ్వలేదు. అంటే ఇది రాజమౌళి కావాలని ప్లాన్ చేశాడా అంటూ కొందరు డౌట్ పడుతున్నారు.

 

ఇక సినిమా నుండి అల్లూరి సీతారామరాజుగా రాం చరణ్, అలియా భట్ ఫోటోలు క్లారిటీ లేకపోయినా భలే థ్రిల్ చేశాయి. ఆర్.ఆర్.ఆర్ ను 2020 జూలై 30 నుండి 2021 జనవరి 8కి వాయిదా వేశారు. ఇక ఆర్.ఆర్.ఆర్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ గురించి హీరోల ఇద్దరి ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. అయితే లేటెస్ట్ టాక్ ప్రకారం మార్చ్ 27 రాం చరణ్ బర్త్ డే కానుకగా ఆర్.ఆర్.ఆర్ నుండి అల్లూరి లుక్ రిలీజ్ చేస్తారట. ఇక మే 20న తారక్ బర్త్ డే కానుకగా కొమరం భీం లుక్ రివీల్ చేస్తారని తెలుస్తుంది.

 

సినిమా సెట్స్ మీద ఉండగానే అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఆ అంచనాలకు తగినట్టుగానే సినిమా బిజినెస్ జరుగుతుంది. ఇప్పటికే ఆర్.ఆర్.ఆర్ బిజినెస్ అన్ని భాషల్లో కలిపి 260 కోట్ల దాకా చేసిందట. ఒక తెలుగు సినిమాకు ఈ రేంజ్ డిజిటల్ రైట్స్ రావడం రికార్డ్ అనే చెప్పొచ్చు. మళ్లీ బాహుబలి లాంటి కాదు కాదు దాన్ని మించే అద్భుతాన్ని చూసేందుకు మీరంతా సిద్ధం కండి అంటూ జక్కన్న హింట్ ఇస్తూనే ఉన్నాడు. ఒకరి చరణ్, తారక్ స్క్రీన్ షేర్ చేసుకుంటున్న ఈ ట్రిపుల్ ఆర్ సంచలనాలకు ప్రతి ఒక్క సిని అభిమాని సాక్ష్యంగా ఉండాలని ఆశిద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి: