మన తెలుగులో సినిమాల మీద ఉండే ఆసక్తి అంతా ఇంతా కాదు. చిన్న సినిమా విడుదల అవుతున్నా సరే తెలుగు ప్రేక్షకులు ఆసక్తికరంగా చదువుతూ ఉంటారు. సినిమాలో ఎవరు నటిస్తున్నారు...? ఎవరు ఏ పాత్రలో ఉన్నారు...? ఇలాంటివి అన్నీ తెలుసుకునే వరకు జనాలకు ఉత్సాహం ఆగదు అనేది వాస్తవం. దీనినే కొంత మంది ఎక్కువగా క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సోషల్ మీడియాలో క్రేజ్ కోసం కొందరు ఆత్రంగా చేసే పనులు సినిమాను ఇబ్బంది పెడుతున్నాయి అనేది వాస్తవం. 

 

సాధారణంగా ఒక సినిమా విడుదల అవుతుంది అనగానే ఆ సినిమా లుక్స్ విషయంలో ఆసక్తి ఉంటుంది. అగ్ర హీరోల సినిమాలు అయితే ఇంకాస్త ఎక్కువ క్రేజ్ ఉంటుంది. దీనితో సినిమా షూటింగ్ లో పాల్గొనే వాళ్ళు కొన్ని ఫోటోలను లీక్ చేస్తున్నారు. అత్తారింటికి దారేది సినిమా దగ్గరి నుంచి కూడా ఇప్పటి వరకు ఇది సినిమాను ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది. సినిమాలో కీలక సన్నివేశాలను చిత్రీకరించే సమయంలో వీడియోలు తీయడం వంటివి చేస్తున్నారు. ఫోటోలు తీసి సోషల్ మీడియాలో విడుదల కూడా చేస్తున్నారు కొందరు జనాలు. 

 

దీనితో సినిమాను కష్టపడి తీసే దర్శక నిర్మాతలు ఈ పరిణామం తో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు అనేది వాస్తవం. అసలు సినిమాను ఏ విధంగా కాపాడుకోవాలో అర్ధం కావడం లేదు. గత రెండు నెలల్లో ఆర్ఆర్ఆర్ సినిమా లుక్స్, తాజాగా చిరంజీవి లుక్స్ బయటకు వచ్చాయి. ఇక కొన్ని వీడియోలు కూడా కొందరు తీయగా ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ అడ్డుకున్నట్టు తెలుస్తుంది. ఇలా ఎక్కడ చూసినా సరే సినిమాను ఈ అతి గాళ్ళు ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నారు. ఒక్కో లుక్ కోసం దర్శకులు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. అలాంటిది దాన్ని అర్ధం చేసుకోకుండా ఇబ్బంది పెడుతున్నారు. మరి సినిమాను దర్శకులు ఏ విధంగా కాపాడుకుంటారు అనేది చూడాలి. ఫోన్ లు బ్యాన్ చేసినా సరే ఇది ఆగడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: